Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఎబి ఆరోగ్యదాన్ పథకం
ఎబి ఆరోగ్యదాన్ గ్రూప్ మెడిక్లెయిం బీమా పాలసీ ప్రధానాంశాలు

1) ఎబి ఆరోగ్యదాన్ పాలసీ వ్యవస్థ & బీమా చేయబడు స్థాయిలు :
09.06.2014 నుండి ప్రవేశపెట్టబడిన సూపర్ టాప్ అప్ విధానం తరువాత , ఎబి ఆరోగ్యదాన్ వ్యవస్థ ఈ క్రింది విధంగా మార్చబడినది
ఎ) ప్రధాన పాలసీ
బి) సూపర్ టాప్ అప్ పాలసీ

ఎ) ప్రధాన పాలసీ:
ఎబి ఆరోగ్యదాన్ పథకం లోని ప్రధాన పాలసీ , ప్లాన్ A మరియు ప్లాన్ B క్రింద, ఐదు బీమా స్థాయిలను కలిగి ఉంటుంది (రూ. లక్షల లో )

1

2

3

4

5

బి) సూపర్ టాప్అప్ పాలసీ:
సూపర్ టాప్ అప్ పాలసీ , 09.06.2014 నుండి ప్రవేశపెట్టబడిన ఒక అసామాన్యమైన పాలసీ. ఇప్పటికే ఉన్న మరియు క్రొత్త పాలసీదారుల సూపర్ టాప్ అప్ పాలసీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్లాన్ A మరియు ప్లాన్ B కింద ఐదు బీమా స్థాయిలు ఉన్నాయి -

(రూ. లక్షల లో )

3

5

7

1

15

5 లక్షల రూపాయల కన్నా అధికంగా ఆరోగ్యబీమా అవసరమనుకున్న పాలసీదారులు సూపర్ టాప్అప్ పాలసీ ని ఎంచుకోవచ్చు.సూపర్ టాప్ అప్ పాలసీ తో సహా లభ్యమయ్యే బీమా మొత్తం ఈ క్రింది విధం గా ఉంటుంది.

(రూ. లక్షల లో)

8

1

12

15

20

2.మూడవ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA)
పాలసీదారుడు, బీమా సంస్థ యొక్క జాబితా లో ఉన్న ఒక తృతీయపక్ష వ్యవహర్త ( థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్- TPA) సేవలను వినియోగించుకొనవచ్చు


బీమా కంపెనీ పాలసీ జారీ చేసిన వెంటనే, తృతీయపక్ష వ్యవహర్త ( థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్- TPA) చే పాలసీదారునికి ఫోటో గుర్తింపు కార్డు జారీ చేయబడుతుంది. తృతీయపక్ష వ్యవహర్త ( థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్- TPA) కు దేశం అంతటా గుర్తింపు పొందిన ఆసుపత్రుల యంత్రాంగం (నెట్ వర్క్ ఆసుపత్రులు ) ఉంటుంది. వాటిలో గుర్తింపు కార్డు చూపించి , నగదు రహిత చికిత్స పొందవచ్చు . అయితే, పాలసీదారునికి , నెట్వర్క్ ఆస్పత్రులు కాని ఇతర ఆసుపత్రులలో చికిత్స పొందే స్వేఛ్చ ఉంది. ఆ సందర్భంలో ముందుగా బిల్లు చెల్లించి తరువాత తృతీయపక్ష వ్యవహర్త (TPA ) నుండి పరిహారం కోరుకోవలసి ఉంటుంది

తృతీయపక్ష వ్యవహర్త (TPA )పాత్ర

M / s యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 09.06.2010 నుండి, M / s గుడ్ హెల్త్ ప్లాన్ లిమిటెడ్ (GHPL) ను ఈ పథకం లో తృతీయపక్ష వ్యవహర్త ( థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్- TPA) గా వ్యవహరించేందుకు నియమించింది

A. పాలసీదారు నెట్ వర్క్ ఆసుపత్రిలో చేరిన పక్షంలో

పాలసీదారుడు నెట్వర్క్ ఆసుపత్రిలో చేరడానికి నిర్ణయించుకున్న సందర్భంలో , ఆ ఆసుపత్రి నగదు రహిత చికిత్స కోసం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA ) నుంచి అనుమతి పొందడానికి ఏర్పాట్లు చేస్తుంది. అర్హత పరిమితిని మించిన మొత్తం మరియు అనుమతింపబడని ఖర్చులతో సహా ( క్రింద పేర్కొన్న3 E ప్రకారం) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది



బి పాలసీదారు, నెట్ వర్క్ లో లేని ఆసుపత్రిలో చేరిన పక్షంలో

ఈ సందర్భంలో పాలసీదారు మొదట ఆసుపత్రిలో బిల్లు చెల్లించి,తరువాత థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA )నుండి బిల్లు మొత్తాన్ని అర్ధించవచ్చు.సదరు క్లెయిమ్ పత్రాలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నాటి నుంచి 30 రోజుల లోపల థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA) కు సమర్పించాలి.
అనుమతింపబడే ఆసుపత్రి వ్యయాల వివరాలు

ఈ పథకం కింద అనుమతించదగిన ఏ క్లెయిమ్ లు అయినా, బీమా కంపెనీ, TPA ద్వారా వైద్యశాల / నర్సింగ్ హోం లేదా బీమా చేసిన వ్యక్తికి చెల్లిస్తుంది. బీమా చేసిన వ్యక్తి తరపున సహేతుకంగానూ మరియు తప్పనిసరిగా చేసిన ఖర్చులను , క్రింద పేర్కొన్న వివిధ శీర్షికల కింద షెడ్యూల్ లో పేర్కొన్న బీమా మొత్తానికి మించకుండా చెల్లిస్తుంది.

ఎ) హాస్పిటల్ / నర్సింగ్ హోం ఏర్పాటు చేసిన వసతి ,భోజన మరియు నర్సింగ్ ఛార్జీల నిమిత్తం అయ్యే రోజువారీ ఖర్చులలో , గరిష్టంగా బీమా మొత్తం లో 1% లేదా వాస్తవ ఖర్చుల్లో ఏది తక్కువైతే అది అనుమతింపబడుతుంది . ఈ అనుమతింపబడే ఖర్చులో నర్సింగ్ కేర్, RMO ఛార్జీలు , IV ద్రవాలు / బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ / ఇంజెక్షన్ మరియు పరిపాలనా సంబంధిత ఖర్చులు కలిసి ఉన్నాయి.

B) IC యూనిట్ లో చేరిన పక్షంలో , ప్రతి రోజుకు , బీమా మొత్తంలో 2% లేదా వస్తావా ఖర్చులో ఏది తక్కువైతే అది చెల్లించబడుతుంది

సి) ప్రధాన శస్త్రచికిత్సకుడు, మత్తుమందు, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్స్, నిపుణులు ఫీజు
మత్తుమందు, రక్తం, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, శస్త్రచికిత్స పరికరాలు, మందులు & డ్రగ్స్ డయాగ్నోస్టిక్ మెటీరియల్స్ మరియు ఎక్స్ రే, డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ, కృత్రిమ అవయవాలను, గతిప్రేరక సంబంధిత ప్రయోగశాలలో నిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్స ప్రక్రియ సమయంలో అమర్చిన శరీర పరికరాల ఖర్చు మరియు ఇలాంటి ఖర్చులు

D) అవయవ మార్పిడి విషయంలో ,దాత నిమిత్తం అయిన ఆసుపత్రి ఖర్చులు (ఆర్గాన్ ఖర్చు మినహాయించి, ఉన్నట్లయితే )

ఇ) సూపర్ టాప్ అప్ విధానం పరిచయం కారణంగా బీమా స్లాబ్లు పెరగడం వల్ల ఈ క్రింది పేర్కొన్న అనారోగ్యాలకు క్లెయిమ్ లు పరిమితం చేయబడ్డాయి


ఆసుపత్రిలో ప్రయోజనాలు

ప్రతి ఆసుపత్రిలో పరిమితులు

కేటరాక్ట్

బీమా మొత్తంలో 10%, గరిష్టంగా రూ.25000

హెర్నియా

బీమా మొత్తంలో 15%, గరిష్టంగా రూ.30000

గర్భాశయాన్ని / గర్భాశయములోని తంతుయుత కణజాల నిరపాయ కంతిని శస్త్రచికిత్స ద్వారా తొలగించుట

బీమా మొత్తంలో 20 %, గరిష్టంగా రూ.50000

నిర్దేశించిన ఈ క్రింది పెద్ద శస్త్రచికిత్సలకు

  • కార్డియాక్ శస్త్రచికిత్సలు
  • క్యాన్సర్ శస్త్రచికిత్సలు
  • బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలు
  • సిక్, సైనస్ సిండ్రోమ్ కోసం ఇంప్లాంటేషన్
  • తుంటి మార్పిడి
  • మోకాలు కీళ్ళ మార్పిడి

బీమా మొత్తంలో 80 %, గరిష్టంగా రూ.16 లక్షలు

అయితే, సూపర్ టాప్ అప్ విధానం ఎంచుకున్న పాలసీదారులకు, త్రెష్హోల్డ్ బీమామొత్తంలో 1%, గరిష్టంగా 5,000 / - లేదా ఏది తక్కువైతే అంతవరకు రూమ్ అద్దె అనుమతించబడుతుంది

ఆసుపత్రిలో చేరక ముందు, తరువాత క్లెయిమ్ లు

ఆసుపత్రిలో ప్రయోజనాలు

ప్రతి ఆసుపత్రిలో పరిమితులు

ఏ అనారోగ్యం సంబంధించిన అయినా, ఆసుపత్రిలో చేరక ముందు, డిశ్చార్జ్ అయిన తరువాత

ప్రధాన పాలసీ మరియు సూపర్ టాప్ విధానం కింద సంబందిత బీమామొత్తంలో గరిష్టంగా 10% మొత్తానికి లోబడి వాస్తవ ఖర్చులు

తిరిగి తరువాత
chiclogo