Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఐవిఆర్ లావాదేవి ( ట్రాన్సాక్షన్ )

ప్రియమైన వినియోగదారుడా,

మా ఖాతాదారులకి మరిన్ని విలువలు చేకూర్చే మా నిరంతర ప్రయత్నంలో, మరొక అత్యంత సురక్షితమైన పర్యావరణం లేదా విధానం టెలిఫోన్/మొబైల్ (ఐవిఆర్) ద్వారా జరిపే చెల్లింపు లావాదేవీ కోసం మేము ప్రవేశపెడుతున్నారు. క్రెడిట్ కార్డులు ద్వారా చేసిన అన్ని లావాదేవీలపై భారత రిజర్వు బ్యాంకు (RBI) యొక్క ఆదేశాల ప్రకారం కల్పించిన ఒక అదనపు భద్రతా స్థాయి.

ఒటిపి (ఒన్ టైం పాస్వర్డ్) అనగా ఐవిఆర్ లావాదేవీ ప్రక్రియ సమయంలో నమోదయిన మీ మొబైలునకు పంపబడిన ఒక సురక్షిత కోడ్. వ్యవహరణ ( ట్రాన్సాక్షన్ ) పూర్తి చేయటానికి ఈ OTP ని ఎంటర్ చేయటం అత్యవసరం.

ఒక వేళా ఏదైనా కష్టము కలిగినచో, మీరు ఐవిఆర్ లావాదేవీ ప్రారంభించకు ముందే POTP ( పిఒటిపి -ప్రి వన్ టైమ్ పాస్వర్డ్) పొందుటకు 5676798 లేదా 9212738927 కు ఎస్ఎంఎస్ ( SMS ) పంపవచ్చు. SMS ఫార్మాట్ "ANDB XXXX (మీ కార్డ్ నంబర్ చివరి 4 అంకెలు)" గా ఉండాలి. ఎస్ఎంఎస్ ద్వారా అందిన POTP ఐవిఆర్ లావాదేవీ జరిపే సమయంలో ఎంటర్ చేయవలెను.

ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ కొరకు మీ మొబైల్ సంఖ్య నమోదు చేయని పక్షంలో, దయచేసి ఇప్పుడు దిగువన వివరించిన విధంగా నమోదు చేసుకొనవచ్చు:

మా 24x7 హెల్ప్ డెస్క్ నంబర్లు 1800 425 4059 (టోల్ ఫ్రీ) లేదా 080-4342 8125/26/30 పై కాల్ చేయవచ్చు.

ccdhelpdesk@andhrabank.co.in కి మెయిల్ పంపండి:

మరిన్ని వివరాల మా వెబ్సైట్ చూడండి: www.andhrabank.in


FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)


  • ఐవిఆర్ లావాదేవీ ( IVR Transaction ) అంటే ఏమిటి?

    ఐవిఆర్ ( ఇంటర్ వాయిస్ రికార్డింగ్ ) లావాదేవీ అనగా భౌతికంగా కార్డు ప్రదర్శించడకుండా, క్రెడిట్ కార్డ్ వివరాలు వుపయోగించి ఒక సేవ పొందేటందుకు లేదా ఒక ఉత్పత్తి కొనుగోలు చేసేటందుకు టెలిఫోన్ / మొబైల్ ద్వారా జరిపే చెల్లింపు వ్యవహారమే.
  • ఐవిఆర్ లావాదేవీలు ఎలా ప్రాసెస్ చేయబడతాయి?

    ప్రస్తుతం, ఐవిఆర్ వ్యవస్థ (మొబైల్ / టెలిఫోన్) ద్వారా చెల్లింపుల కోసం కార్డ్ సంఖ్య, ఎక్సపైరీ తేదీ, CVV కోడ్ (కార్డ్ వెనుకన వున్న 3 అంకెల కోడ్) మరియు అమౌంట్ ( ద్రవ్య మొత్తం ) తెలియజేయవలెను.
  • ఇప్పుడు, ఐవిఆర్ లావాదేవీల గురించి క్రొత్త విషయం ఏమిటి?

    ఇప్పుడు అన్ని ఐవిఆర్ లావాదేవీలు ఆర్బిఐ ( RBI ) నిర్దేశించినట్లు, ఒక అదనపు ప్రామాణీకరణ పాస్వర్డ్ ఒటిపి లేదా పిఒటిపి (అడిషనల్ అతన్టికేషన్ పాస్వర్డ్ - OTP లేదా POTP ) తో ప్రాసెస్ చెయ్యబడుతున్నాయి.
  • ఈ పాస్వర్డ్ ఏమిటి మరియు ఇది నేను ఎలా పొందగలను?

    లావాదేవీ జరిపే సమయంలో SMS ద్వారా మీ నమోదయిన మొబైల్ ఫోనుకి పంపబడే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP). మీ టెలిఫోన్ / మొబైల్ ద్వారా ఐవిఆర్ లావాదేవీ చేస్తున్నప్పుడు యీ ఒటిపి ఎంటర్ చేయవలసి ఉంటుంది.

    దీనికి అదనంగా, 5676798 లేదా 9212738927 కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పిఒటిపి (ప్రి వన్ టైమ్ పాస్వర్డ్) సౌకర్యం ఉపయోగించవచ్చు. SMS ఫార్మాట్ "ANDB XXXX (మీ కార్డ్ నంబర్ చివరి 4 అంకెలు)" గా ఉండాలి. ఎస్ఎంఎస్ ద్వారా అందుకున్న పిఒటిపి ఐవిఆర్ లావాదేవీలు చేస్తూ ఎంటర్ చేయవలసి వుంటుంది.
  • నాకు అందిన ఒటిపి లేదా పిఒటిపి సేవ్ చేసి, నేను ఏదైనా భవిష్య లావాదేవీలకి ఉపయోగించవచ్చా?

    ఉపయోగించ కూడదు. ఒటిపి / పిఒటిపి అనేది ఒక సురక్షిత పాస్వర్డ్ మరియు ఒక లావాదేవీ కోసం చెల్లుబాటు అవుతుంది లేదా 4 గంటల సేపు మాత్రమే చెల్లుతుంది మరియు ఆ తరువాత ముగుస్తుంది. ప్రతి ఐవిఆర్ లావాదేవీ కోసం ఒక కొత్త ఒటిపి అవసరం.
  • నేను క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మొబైల్ నంబర్ ఇవ్వలేదు?
  • ఇటీవల నేను నా మొబైల్ నెంబర్ మార్చుకున్నాను, కాని నమోదు చేసుకోలేదు?

    ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు అయినా మీరు మీ మొబైల్ సంఖ్యను కొత్తగా నమోదు మరియు మార్పు చేయవచ్చు. నమోదు / మైబైల్ నెంబర్ మార్చే ప్రక్రియ గురించి తెలుసుకొనుటకు దయచేసి ఈ క్రింది విధంగా సంప్రదించండి:
    1. మా 24 X 7 హెల్ప్ డెస్క్ సంఖ్య: 1800 425 4059 (టోల్ ఫ్రీ) కు కాల్ చేయవచ్చు.

    2. ccdhelpdesk@andhrabank.co.in కి కార్డ్ నంబర్ & పేరు తో ఒక మెయిల్ పంపవచ్చు.

ఏదైనా కష్టము కలిగినచో, కార్డుదారులు ఈ దిగువ ఇచ్చిన మా 24X7 హెల్ప్ డెస్క్ నెంబర్లకు కాల్ చేయవచ్చు:

  1. టోల్ ఫ్రీ ఫోన్ నంబర్: 1800 425 4059

  2. ఫోన్ నెంబర్: 080-4342 8125/4342 8126/4342 8130

నిబంధనలు & షరతులు

  • ఈ సేవ ఆంధ్రా బ్యాంక్ ద్వారా మీకై తీసుకువచ్చారు మరియు అన్ని ఆంధ్రా బ్యాంకు క్రెడిట్ కార్డుహెల్డర్లకు వర్తిస్తుంది, ఇక్కడ నుండి 'కార్డు హోల్డర్' గా సంబోదించబడును.

  • కార్డు హోల్డర్లు వారి రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వార పంపబడిన సెక్యూర్డ్ పాస్వర్డ్ ఒటిపి (వన్ టైమ్ పాస్వర్డ్) లేదా పిఒటిపి (ప్రి వన్ టైమ్ పాస్వర్డ్) తప్పని సరిగా ఐవిఆర్ వ్యాపారి లావాదేవీలకై ఉపయోగించాలి, అలా ఉపయోగించటంలో మీరు విఫలం అయినట్లయితే లావాదేవీ విజయవంతంగా పూర్తి కాదు. ఈ నిభందన RBI ఆదేశానుసారం ప్రకారం, 01 జనవరి 2011 నుంచి అమలులోకి వచ్చింది.

  • ఐవిఆర్ సేవ లేదా సౌకర్యం వాడుక యొక్క కార్యక్రమమునందు ఏదైనా నష్టం లేదా హాని చేత భాదింపబదినచో, లేదా ఏదైనా వ్యక్తిగత గాయంతో బాధపడ్డా ఆంధ్రా బ్యాంక్ యొక్క భాద్యత కాదు మరియు ఈ విషయం లో బ్యాంకు ఎ జోక్యము కలుగజేసుకోదు.

  • నమోదైన మొబైల్ నంబర్కు పంపిన ఐవిఆర్ 3D సురక్షిత ఒటిపి లేదా పిఒటిపి ఒక నిర్ధారిత సమయము వరకే చెల్లుబాటు కలిగివుంటుంది ఆ తర్వాత ముగిసిపోతుంది . అందుకే కార్డు హోల్డర్స్ నిర్దేశించిన కాలం లోపల ఒటిపి లేదా పిఒటిపి ( OTP లేదా POTP) ని ఉపయోగించాలి. ఎక్స్పైరీ తర్వాత ఎంటర్ చేయబడ్డ ఒటిపి లేదా పిఒటిపి బ్యాంక్ ద్వారా ఆతన్టికేట్ చేయబడదు.
  • బ్యాంక్ నమోదైన మొబైల్ నంబర్లకు దాని సామర్ధ్యం మేరకు ఎస్ఎంఎస్ ద్వారా ఐవిఆర్ 3D సురక్షిత ఒటిపి లేదా పిఒటిపి పంపించటానికి ప్రయత్నం చేస్తుంది. కార్డ్ హోల్డర్కి SMS యొక్క డెలివరీ టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్స్ మరియు బ్యాంక్ నియమించిన సర్వీస్ ప్రొవైడర్లు అందించే కనెక్టివిటీ మరియు సేవలు ఆధారపది ఉంటుంది. SMS అందక పోవటం, ఆలస్యం,లోపం,కస్టమర్ లేదా మర్చంట్ నుండి వచ్చు సమాచారం మరియు సూచనలను ప్రసారమునందు నష్టం లేదా వక్రీకరణ పట్ల బ్యాంకు ఏవిధంగాను తన నియంత్రణ దాటి బాధ్యత వహించదు. బ్యాంక్ ఇటువంటి కారణాల వల్ల వాటిల్లిన నష్టాలకు ఎటువంటి బాధ్యత వహించదు.

  • అనిశ్చిత సమయాల్లో మరియు లేదా చట్టపరమైన చట్టాలు లేదా RBI, IBA మొదలగు యొక్క ఆదేశాలు ప్రకారం, బ్యాంక్ ఐవిఆర్ 3 డి సురక్షిత ప్రమాణీకరణ డిసేబుల్ చేయుటకు హక్కు కలిగిఉంది.

  • కార్డు హోల్డర్లు వారి యొక్క సరైన మొబైల్ నెంబర్ ఆంధ్రా బ్యాంక్ తో నమోదు అయిందని నిర్ధారించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒటిపి లేదా పిఒటిపి SMS ద్వారా ఈ మొబైల్ ఫోనుకే ప్రసారం చేయబడుతుంది.

  • దొంగతనం / నష్టం / కార్డు గ్రహీత యొక్క మొబైల్ నెంబర్ మార్పు విషయంలో, కార్డు గ్రహీత బ్యాంక్ రికార్డుల్లో మొబైల్ నెంబర్ తొలగింపు కోసం బ్యాంకుకు నివేదించాలి. ఆ విధంగా నివేదన చెయ్యకపోతే, ఆంధ్రాబ్యాంక్ ఏవైనా మోసపూరిత లావాదేవీల / నష్టం బాధ్యులు ఉండాలి తెలియచేస్తుంది.

  • ఆంధ్రా బ్యాంక్ ఉపసంహరించే /మార్పు / సస్పెండ్ /రద్దు/ఎప్పటికప్పుడు సవరణ మరియు/లేదా ఏ కారణం లేకుండా లేదా ముందస్తుగా కార్డు హోల్దరుకు ఏ నోటిసు ఇవ్వకుండా ఏ సమయంలోనైనా నిబంధనలను మార్చే హక్కును కలిగిఉంది. సేవకు సంభందించి అన్ని నిర్ణయాలు ఆంధ్రాబ్యాంక్ స్వంత అభీష్టానుసారం ఉండాలి మరియు అదే, చివరి ,కట్టుబడి మరియు ప్రశ్నించని విధంగా ఉండాలి.

  • ఈ సేవకు సంబంధించి తలెత్తే వివాదం హైదరాబాద్ న్యాయస్థానాల విస్తృత అధికార పరిధిలో లోబడి మాత్రమే ఉండాలి. ఒక వివాదం ఏదైనా ఉంటే, అది ఆంధ్రా బ్యాంక్ వ్యతిరేకంగా ఒక దావా మాత్రం కాదు.

  • ఈ సేవ ఉపయోగించు కార్డుహోల్డర్లు ఈ పైన పేర్కొన్న నిబంధనలను & షరతులు చదివి, అర్థం చేసుకుని మరియు ఒప్పుకున్నట్లుగా (మరియు ఎప్పటికప్పుడు సవరించిన) అంగికరించినట్లుగా భావించబడును.

chiclogo