Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


సేవింగ్స్ - RFC

సాధారణంగా ఈ ఖాతాలు తెరవడానికి గల ముఖ్య ఉద్దేశ్యం


విదేశాల నుంచి భారత దేశానికి తిరిగి వచ్చే భారతీయులు వారి ధనాన్ని విదేశీ కరెన్సీ ల లోనే ఉంచుకోదలిస్తే మరియు వారికి రిపాట్రియేషన్ సౌలభ్యమ్ కూడా కావాలనుకుంటే ఈ ఖాతా ఉపయోగపడుతుంది. వారు మరలా ఎన్‌ఆర్‌ఐ గా మారిన పక్షంలో ఈ ఖాతాలలోని నిధులను ఎన్‌ఆర్‌ఈ/ఎఫ్‌సి‌ఎన్‌ఆర్ ఖాతాలలోకి మార్చుకోవచ్చు/బదిలీ చేయవచ్చు.


ఖాతా నిర్వహించబడే కరెన్సీ


విదేశీ కరెన్సీ - ప్రస్తుతానికి USD / GBP / EURO/ CAD / AUD మాత్రమే


ఉమ్మడి ఖాతాలు


ఇతర అర్హత గల వ్యక్తి తో అనుమతించడమైనవి.


ఖాతాల నిర్వహణ


మాండేట్ లేదా పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ను నియమించవచ్చు. కానీ వీరి అధికారాలు స్థానిక చెల్లింపులు మరియు అర్హత కలిగిన పెట్టుబడులు లేదా ఖాతాదారునికి చేయు బదలాయింపుల వరకు మాత్రమే పరిమితమయ్యాయి.


నామినేషన్


నామినీ నివాసి / ఎన్నారై / పి‌ఐ‌ఓ కావచ్చు


అనుమతి గల క్రెడిట్లు (జమలు) మరియు డెబిట్లు (ఖర్చులు)


క్రెడిట్స్(జమలు):


విదేశాల నుంచి రెమిటన్సెస్/ ఇతర ఎన్‌ఆర్‌ఈ / ఎఫ్‌సి‌ఎన్‌ఆర్ ఖాతాల నుండి బదిలీ, రిపాట్రియబుల్ స్వభావంగల ఎన్‌ఆర్‌ఈ ఖాతా లేదా ఇతర ఎన్‌ఆర్‌ఈ ఖాతాలనుంచి నుంచి వచ్చిన వడ్డీ మరియు చెల్లింపులు, పెన్షన్ లేదా ఏదేని ఇతర వృద్దాప్య లేదా భారతదేశం వెలుపల తన యజమాని నుండి వచ్చిన ఇతర ద్రవ్య లాభాలు.

ఉపసంహరణలు:
ఉపసంహరించు నిధులు విదేశీ కరెన్సీ బ్యాలన్సుల వినియోగం పై గల అన్ని పరిమితులనుంచి మినహాయింపబడ్డాయి. అన్ని రూపాలలోని పెట్టుబడులపై ఉన్న పరిమితులు కూడా వీటికి పర్తించవు.

పన్ను ప్రయోజనాలు


పన్ను లేదు.


నామినేషన్లు


అనుమతించబడ్డాయి. నివాస లేదా ప్రవాస భారతీయులను నామినీలుగా నియమించుకోవచ్చు.


స్వదేశానికి తిరిగి పంపడం (Repatriation)


Repatriable(రిపాట్రియబుల్). రిజర్వు బ్యాంకు తో సంబంధం లేకుండా సంపాదించిన వడ్డీతో సహా భారత దేశం వెలుపలి దేశానికి పంపవచ్చు.


కావలసిన పత్రాలు / పరిచయం


i) పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ వీసా ప్రతులు.
ii) విదేశీ నివాస చిరునామా గల పత్రాలు
iii) పత్రాల ధృవీకరణ (అటెస్టేషన్) / పరిచయం
ఎ) విదేశాన గల భారత దౌత్య కార్యాలయము (Indian Embassy Abroad)
బి) హైకమిషన్ / కాన్సులేట్
బి) మా విదేశీ ప్రాతినిధ్య బ్యాంక్
సి) మా ప్రతినిధ్య కార్యాలయాల అధికారులు
డి) పూర్తి KYC నిబంధనలకు లోబడిన స్థానిక కస్టమర్
ఇ) ఒక స్థానిక నివాసి (పూర్తి KYC నిబంధనలను లోబడి)


chiclogo