|
ఆంధ్రా బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ జ్ఞానాన్ని పెంపొందించే శక్తి కేంద్రంగా విలసిల్లుతూ మా బ్యాంక్ సంస్థాగత లక్ష్య సాధనకు మద్దతు గా నిలుస్తోంది. ఈ కళాశాలలో నాణ్యత కలిగిన సమాచారం అందించడం ద్వారా ఉద్యోగుల పరిజ్ఞాన స్థాయి, ప్రతిస్పందన మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుకు ప్రయత్నిస్తున్నాము
|
|
మా శిక్షణాసిద్ధాంతం/1} |
 |
సాంకేతికత మరియు శిక్షణ పొందిన ఉద్యోగులు మన తక్షణావసరం. అందువలన మా బ్యాంక్ లో శిక్షణ, సంస్థ అభివృద్ధిలో ఒక సమగ్ర భాగంగానూ చురుకైన నిరంతర ప్రక్రియ గానూ కొనసాగుతోంది ఉద్యోగుల లో వ్యక్తిగత జ్ఞానసముపార్జన, నైపుణ్య అభివృద్ధి మరియు దృక్పధంలో మార్పు లక్ష్యంగానూ, సంస్థాగతంగా ప్రభావశీల కార్యసాధన లక్ష్యంగానూ శిక్షణ రూపొందించబడుతుంది
|
|
|
లక్ష్యాలు |
 |
- సంస్థాగత లక్ష్య సాధనాదిశగా నాణ్యమైన శిక్షణ అందించడం
- ఉద్యోగ జ్ఞానం, వ్యవస్థ మరియు విధానాల పట్ల దృష్టి సారించడం ద్వారా, శిక్షనార్ధుల సామర్ధ్యాలను మెరుగు పరచడం
- సిబ్బంది లో భాగస్వామ్య వైఖరి ,నాయకత్వ లక్షణాలు పెంపొందించి, తద్వారా సంస్థ యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదం చేయడం
- బ్యాంక్ మార్కెట్ వాటా పెంచేందుకు మరియు వ్యాపారంలో అగ్రగాములు గా నిలిచేందుకు అవసరమైన అవగాహన కల్పించడం
- సిబ్బంది మరింత సమర్థవంతంగా ,నమ్మకంగా శాఖాకార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన సామర్ధ్యాన్ని పెంపొందించడం
- ఉద్యోగుల జ్ఞాన స్థాయి, ప్రతిస్పందన మరియు సంభాషణ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడం
- అంతర్గత ప్రక్రియలు మరియు పని వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షించడం.
- సురక్షితంగా శుభ్రంగా మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో కళాశాలనిర్వహించడం.
|
|
|
విధానసలహా కమిటీ |
 |
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ (పర్సనల్) మరియు స్టాఫ్ కాలేజ్ ప్రిన్సిపాల్ తో ఏర్పడిన పాలసీ అడ్వైజరీ కమిటీ శిక్షణా విధానాన్ని ఖరారు చేస్తారు
|
|
|
శిక్షణ అవసరాల అంచనా |
 |
అకడమిక్ కౌన్సిల్ సమావేశాలు మరియు జోనల్ కమిటీ సమావేశాలు నిర్వహించి వాటి ద్వారా శిక్షణ అవసరాలను అంచనా వేసి కార్యక్రమాల క్యాలెండర్ ముసాయిదా రూపొందించడం జరుగుతుంది. అకడమిక్ కౌన్సిల్ లో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు కేంద్ర కార్యాలయంలోని వివిధ శాఖల ముఖ్య అధికారులు ఉంటారు. జోనల్ మేనేజర్ల నేతృత్వం లోని జోనల్ కన్సల్టేటివ్ కమిటీ, జోన్ యొక్క శిక్షణ అవసరాలను అంచనా వేస్తారు
|
|
|
శిక్షణా పద్ధతి |
 |
- క్లాస్ రూమ్ లెక్చర్స్ / చర్చలు
- ప్రముఖ సంస్థలు నుండి అతిధి అధ్యాపకులను ఆహ్వానించడం
- ముఖ్యమైన పత్రాల యొక్క సాఫ్ట్ కాపీని అందించడం
- ఎగ్జిట్ టెస్ట్ నిర్వహణ
- కేస్ స్టడీస్, అభ్యాసాల ద్వారా శిక్షణ
- గ్రూప్ ప్రదర్శన
- ఇన్ బాస్కెట్ వ్యాయామం
- విజయవంతమైన మేనేజర్లు, కార్య సాధకులు మరియు ఎగ్జిక్యూటివ్స్ తో ముఖాముఖీ ఏర్పాటు
- బ్రాంచ్ సాఫ్ట్వేర్ యొక్క సిమ్యులేషన్
- ప్రాక్టికల్ సమస్యలు మరియు పరిష్కారాలు
- హాండ్స్ ఆన్ సెషన్ల నిర్వహణ
|
|
|
పి శిక్షణానంతర మూల్యాంకనం |
 |
కొన్ని ఎంపిక చేసిన కార్యక్రమాల గురించి కాలేజ్ శిక్షణా ప్రభావ మూల్యాంకన నిర్వహిస్తుంది శిక్షణ తేదీ నుండి ఒక నెల తర్వాత, సదరు శిక్షణ పొందిన వారి పని విధానం పై ఆయా శాఖల మేనేజర్లు నుండి అభిప్రాయం స్వీకరింపబడుతుంది. కొన్ని పారామితులు ఆధారంతో ఆ సమాచారాన్ని రేటింగ్ సిస్టమ్ మరియు శిక్షణ ప్రభావం ఇండెక్స్ ద్వారా విశ్లేషించి ఉన్నతాధికారులకు నివేదింపబడుతుంది
|
|
|