Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

faqs

తరచుగా అడిగే ప్రశ్నలు


bulate రిటైల్ »కార్డులు» క్రెడిట్ కార్డులు ఐవిఆర్ లావాదేవీ
greypt

bullet_wh క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి
bullet_wh క్రెడిట్ కార్డ్ రకాలు
bullet_wh ఎక్కడ వీటన్నిటినీ ఉపయోగించవచ్చు
bullet_wh నేను క్రెడిట్ కార్డ్ కు బదులుగా నగదు చెల్లించవచ్చా?
bullet_wh నేను నమ్మడం లేదు
bullet_wh ఒక క్రెడిట్ కార్డ్ కోసం ఎవరిని సంప్రదించాలి?
bullet_wh నాకు క్రెడిట్ కార్డ్ లభిస్తుందా
bullet_wh నిరూపితమైన ఆదాయం అంటే ఏమిటి
bullet_wh నాకు ఆదాయం ప్రమాణం లేక పోతే?
bullet_wh నా టర్మ్ డిపాజిట్ పూర్తి మొత్తం పొందవచ్చా?
bullet_wh అరెరే! అలాంటప్పుడు నా టర్మ్ డిపాజిట్ మీద డిపాజిట్ రుణము భిన్నంగా ఎలా ఉంటుంది
bullet_wh అప్లికేషన్ ఎక్కడ submit చేయాలి
bullet_wh క్రెడిట్ పరిమితి అంటే ఏమిటి
bullet_wh యాడ్ ఆన్ కార్డ్ అంటే ఏమిటి
bullet_wh బిల్లింగ్
bullet_wh రోల్ ఓవర్ సదుపాయం
bullet_wh MPD ఏమిటి (కనీస మొత్తం చెల్లింపు)
bullet_wh బిల్ మొత్తం ఎక్కడ చెల్లించాలి
bullet_wh నేను ఎటిఎం ద్వారా చెల్లించవచ్చా
bullet_wh Standing Instructions
bullet_wh నా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా
bullet_wh నేను నా ఇతర బ్యాంకు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఎలా చెల్లించాలి
bullet_wh నగదు ఉపసంహరణ ఎలా
bullet_wh విచారణ కోసం ఎవరిని సంప్రదించాలి
bullet_wh నేను కార్డ్ పోగొట్టుకుంటే లేదా ఎక్కడైనా మరిచిపోతే
bullet_wh నేను నా భార్య / భర్త / పిల్లలు / స్నేహితులు / సహోద్యోగులకి పిన్ వివరాలు చెప్పవచ్చా
bullet_wh నేను నా డైరీలో వ్రాసుకోవచ్చా
bullet_wh లావాదేవీలో ఏదైనా వివాదం విషయంలో

క్రెడిట్ కార్డులు

bulate క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
greypt

ఇది, కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో కొనుగోళ్లు, సేవలు పొందడానికీ మరియు అత్యవసర విషయంలో కార్డ్ నిర్ణయించిన పరిమితి మేరకు నగదు ఉపసంహరణ సదుపాయం కలగజేసే ఒక ప్లాస్టిక్ సొమ్ము. వాడుక సొమ్మును గడువు తేదీ లోపల పూర్తిగా తిరిగి చెల్లించాలి లేదా రోల్ ఓవర్ సౌకర్యం ద్వారా కనీస చెల్లింపు ను గాని చెల్లించాల్సి ఉంటుంది.

bulate క్రెడిట్ కార్డ్ రకాలు?
greypt
మేము క్రెడిట్ క్లాసిక్., గోల్డ్, ప్లాటినం, మాస్టర్ కార్డ్, ఎలక్ట్రానిక్ మరియు కార్పొరేట్ క్రెడిట్ కార్డులు మరియు వీసా మరియు మాస్టర్ కార్డ్ ఇంటర్నేషనల్తో అనుబంధించిన రకరకాల కార్డులను కలిగి ఉన్నాము

ఎక్కడ వీటన్నిటినీ ఉపయోగించవచ్చు?
greypt

వీసా మరియు మాస్టర్ కార్డుల అనుబంధం ప్రదర్శించిన అన్ని వ్యాపార సంస్థలలోనూ ఆమోదించబడుతుంది.

నేను క్రెడిట్ కార్డ్ కు బదులుగా నగదు చెల్లించవచ్చా?
greypt

మీరు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినపుడు 20-51 రోజుల ఉచిత క్రెడిట్ పొందుతారు మరియు గడువు తేదీ లోగా వాడుక సొమ్ము చెల్లించాలి. ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి.

bulate నేను నమ్మడం లేదు
greypt

భారీ నగదును ఎప్పుడూ చేతిలో ఉంచుకోవడం మంచిది కాదు, అవసరమైనపుడు మాత్రమే నగదు ఉపసంహరణ చేయాలి. కిరాణా సామానులు, బస్ టికెట్స్, రైల్వే టికెట్లు, ఫ్లైట్ టికెట్ మొదలైనవి కొనుగోలు కోసం సక్రమమైన వెబ్సైట్ ద్వారా క్రెడిట్ కార్డు ఉపయోగించవచ్చు. మీరు కూడా TV ఛానల్ ఛార్జీలు, మీ టెలిఫోన్ / మొబైల్ ద్వారా ఫోన్ బిల్లులు తదితర చిన్న చిన్న మొత్తాలను చెల్లించవచ్చు.

bulate క్రెడిట్ కార్డ్ పొందడానికి ఎవరిని సంప్రదించాలి?
greypt

మీరు మీ ఖాతా కలిగి ఉన్న ఏదేని సమీప ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించవచ్చు. వివరాలు తెలుసుకుని దరఖాస్తు కోరండి.

నాకు క్రెడిట్ కార్డ్ లభిస్తుందా?
greypt

మీ ప్రామాణికమైన వార్షిక ఆదాయం రూ .1.80 లక్షల కంటే ఎక్కువగా ఉన్నట్లైతే, మీరు క్రెడిట్ కార్డు లభిస్తుంది.

bulate ప్రామాణికం అయిన ఆదాయం అంటే ఏమిటి?
greypt

శాశ్వతమైన వేతన ఆదాయం లేదా వ్యాపార పరమైన ఆదాయం తో పన్ను చెల్లింకే వ్యక్తి

నాకు ఆదాయం ప్రమాణం లేక పోతే?
greypt

ఏదేని ఆంధ్రా బ్యాంక్ యొక్క బ్రాంచ్ లో కనీస డిపాజిట్ మొత్తము రూ.10,000/- గా గల టెర్మ్ డిపాజిట్లపై లీన్ మార్క్ చేయడం ద్వారా మేము క్రెడిట్ కార్డును జారీ చేస్తున్నాము

నా టర్మ్ డిపాజిట్ పూర్తి మొత్తం పొందవచ్చా?
greypt

టర్మ్ డిపాజిట్ మొత్తం లో 75% మాత్రమే మీ కార్డు లిమిట్ గా ఇవ్వబడుతుంది.

bulate అరెరే!అలాంటప్పుడు నా టర్మ్ డిపాజిట్ మీద డిపాజిట్ రుణము భిన్నంగా ఎలా ఉంటుంది
greypt

1. క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన రోజు నుండి వడ్డీ లేకుండా కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు
2. ఆంధ్రా బ్యాంక్ ATM లేదా ఇతర ATM వద్ద నగదు ఉపసంహరణకు ఛార్జీలు వర్తిస్తాయి.
3. నిరాటంకమైన మరియు ఏ సమయంలోనైనా కొనుగోళ్ళు. చేయవచ్చు. ఏ సేవ ఛార్జీలు వర్తించకుండా ఉండటానికి గడువు తేదీ లోగా చెల్లించండి.
4. మీరు మీ కొనుగోళ్ళతో సంబంధం లేకుండా టర్మ్ డిపాజిట్ మీద వడ్డీ లభిస్తుంది.
5. మీరు రోల్ ఓవర్ సదుపాయం క్రింద, బిల్లు మొత్తంలో 5% చెల్లించవచ్చు. కానీ క్యారీ ఓవర్ బాలన్స్ పై సర్వీస్ ఛార్జీలు వుంటాయి
6. మీరు మీ డిపాజిట్ పై వడ్డీ సంపాదిస్తూ ఉండగా కూడా , తిరిగి మీ డిపాజిట్ మొత్తంలోని తగిన మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా వినియోగించుకోవచ్చు.

bulate దరఖాస్తును ఎక్కడ సమర్పించాలి?
greypt

పూర్తిగా నింపిన దరఖాస్తు తో పాటు సంబందిత పత్రాలను మీ ఖాతా ఉన్న బ్రాంచ్ కు సమర్పించండి.

bulate క్రెడిట్ పరిమితి అంటే ఏమిటి?
greypt

ఇది మీరు మీ క్రెడిట్ కార్డు ఉపయోగించి చేసే ఖర్చు లేదా నగదు ఉపసంహరణల గరిష్ట మొత్తం. ఆదాయం పరిమాణం ప్రకారం పరిమితి మంజూరు చెయ్యడం జరుగుతుంది.

bulate యాడ్ ఆన్ కార్డ్ అంటే ఏమిటి?
greypt

ఒక అదనపు కార్డ్ ను, ప్రధాన కార్డు హోల్డర్ యొక్క పిల్లలు లేదా తల్లిదండ్రులకు దాని పరిమితులు పంచుకుంటూ జారీ చేస్తారు. అన్ని వినియోగాలు మరియు ఛార్జీలు ప్రధాన కార్డును కలిగి ఉన్నవారికి బిల్లింగ్ చేస్తారు. కార్డు పరిమితి మేరకు, అందరూ దీనిని ఉపయోగించవచ్చు.

bulate బిల్లింగ్

ఒక నెలలో కార్డ్ ని వినియోగించి చేసిన ఖర్చు మొత్తము వివరాలతో సహా నెలవారి బిల్లులో పొందుపరిచి , ఆ బిల్లు సాఫ్ట్ కాపీని ఇ-మెయిల్ ID కి పంపడం జరుగుతుంది. దీనిలో బిల్లు మొత్తము, రోల్ ఓవర్ సదుపాయం క్రింద చెల్లించవలసిన కనీస మొత్తము, గడువు తేదీ మొదలైనవి ఉంటాయి

bulate రోల్ ఓవర్ సదుపాయం?
greypt

కార్డు హోల్డర్ ఒక నెల బిల్లు మొత్తంలో కేవలం 5% మాత్రమే చెల్లించి మిగిలిన పరిమితిని హాయిగా వినియోగించవచ్చు కాని ఈ సదుపాయమును వినియోగించుకోవడానికి నెలకు 2.50% సర్వీస్ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది, .

bulate MPD (కనీస మొత్తం చెల్లింపు) అంటే ఏమిటి?
greypt

రోల్ ఓవర్ సదుపాయం క్రింద ఒక నెలలో చెల్లించవలసిన బిల్లు మొత్తంలో 5% ను MPD(కనీస మొత్తం చెల్లింపు) అంటారు . మీరు కూడా 5% కంటే ఎక్కువ లేదా పూర్తి బిల్లు మొత్తం చెల్లించవచ్చు.

bulate బిల్ మొత్తం ఎక్కడ చెల్లించాలి?
greypt

క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం, నగదు/చెక్కు/DD రూపంలో అన్ని ఆంధ్రా బ్యాంక్ శాఖలు వద్ద చెల్లించవచ్చు. మా క్రెడిట్ కార్డు కేంద్రాలు కూడా బిల్లు మొత్తంను చెక్కుల మరియు డ్రాఫ్టులు రూపంలో సేకరించడానికి అనుమతించబడినవి. క్రెడిట్ కార్డు కేంద్రాల చిరునామాలు బిల్లులో పేర్కొన్నారు.

bulate నేను ఎటిఎం ద్వారా చెల్లించ వచ్చునా?
greypt

అవును. మీరు మీ బ్యాంకుతో రిజిస్టర్ చేసుకున్న తరువాత, ఆంధ్రా బ్యాంకు డెబిట్ కార్డ్ వుపయోగించి, ఆంధ్రా బ్యాంక్ ఎటిఎం ద్వారా మాత్రమే చెల్లించవచ్చు.

Standing Instructions
greypt

మీరు మీ ఖాతా గల ఆంధ్ర బ్యాంకు బ్రాంచిలో standing instructions జారీ చేసుకోవచ్చు. మీరు కనీస లేదా పూర్తి బిల్లు చెల్లించమని కోరవచ్చు. గడువు తేదీ నాడు బిల్లు మొత్తము డెబిట్ అవుతుంది.

bulate నా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా చెల్లించాలి?
greypt

మీరు ఆన్లైన్ చెల్లించడానికి నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న తరువాత, ఆంధ్రా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ వుపయోగించి చెల్లించవచ్చు.

bulate నేను నా ఇతర బ్యాంకు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఎలా చెల్లించాలి?
greypt

మీరు MPD మొత్తం లేదా మొత్తం బిల్లు చెల్లించడానికి NEFT (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) సౌకర్యం ఉపయోగించవచ్చు.వివరాలకోసం చెల్లింపు ఎంపికలు పరిశీలించండి

నగదు ఉపసంహరణ ఎలా చేయాలి?
greypt

కార్డ్, మీ తపాళా చిరునామాకి పంపిన తరువాత, మీకు విడిగా పిన్ కూడా పంపించబడుతుంది. ఆ పిన్ ను ఉపయోగించుకుని మీరు ATMs వద్ద నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు.

విచారణ కోసం ఎవరిని సంప్రదించాలి.?
greypt

మీరు, మీ కార్డు బ్యాలెన్స్/ఉపయోగించిన కార్డు పరిమితి/లావాదేవీల వివరాలు/పిన్ ఉపయోగం/నగదు పరిమితి మొదలైన వివరాల విచారనాకై మా 24 గంటల హెల్ప్ డెస్క్ టోల్ ఫ్రీ ఫోన్ నంబరు 1800 425 4059 ని సంప్రదించవచ్చు,

నేను కార్డ్ పోగొట్టుకుంటే లేదా ఎక్కడైనా మరిచిపోతే
greypt

వెంటనే కార్డు బ్లాక్ చెయ్యడంకోసం మా సహాయ డెస్క్ ను సంప్రదించండి. మీరు మరలా గుర్తుచేయాల్సిన పని లేకుండానే మేము replacement కార్డును మీకు పంపిస్తాము. కొత్త పిన్ కూడా విడిగా పంపించడం జరుగుతుంది.

నేను నా భార్య / భర్త / పిల్లలు / స్నేహితులు / సహోద్యోగులకి పిన్ వివరాలు చెప్పవచ్చా.?
greypt

కాదు. మీరు మీ కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ మీ పిన్ ఎప్పుడూ బహిర్గతం చేయరాదు!

bulate నేను నా డైరీలో వ్రాసుకో వచ్చునా?
greypt

వద్దు! కార్డు పైన గాని,డైరీ లో గాని వ్రాయవద్దు మరియు మొబైల్ లో కుడా ఫీడ్ చేసుకోవద్దు. మీ పిన్ ను మీరు కేవలం జ్నాపకం ఉంచుకోండి లేదు 'కార్డు, డైరీ పిన్ నెంబర్ వ్రాయండి. మొబైల్లోకూడా ఫీడ్ కాదు పిన్ కేవలం జ్ఞాపకం వుంచుకోండి.

bulate లావాదేవీలో ఏదైనా వివాదం విషయంలో
greypt

ఆంధ్రా బ్యాంక్, క్రెడిట్ కార్డ్ డివిజన్, హెడ్ ఆఫీస్, కోఠీ, హైదరాబాద్-500 095: చిరునామాకు ఫ్యాక్స్-040 2475 5052 లేదా లేఖ పంపడం ద్వారా వివాదాన్ని పంపించండి. సాద్యమైనంత త్వరగా మేము మీకు స్పందిస్తాము. మేము లావాదేవీ వివరాలను, ఛార్జ్ చీటీలను (వ్యయంతో) అందిస్తాము మరియు పరిశోధన తర్వాత, వీసా / మాస్టర్ వివాద పరిష్కారాల నిర్దేశక సూత్రాల ప్రకారం ఏ ఛార్జి అయినా తిరిగి చెల్లించవచ్చు.

 


.......................................................................................................................................... Top

chiclogo