Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

andhra

తరచుగా అడిగే ప్రశ్నలు

andhra Retail»డిపాజిట్లు
andhra

andhra ఎబి స్మార్ట్ ఛాయిస్

andhra RD ప్లస్

ఎబి స్మార్ట్ ఛాయిస్

andhra డిపాజిట్ కనీస మరియు గరిష్ట కాల పరిమితి ఎంత?
andhra
కనీస 7 రోజులు మరియు గరిష్ట 179 రోజులు.

andhra ఈ పథకం కింద డిపాజిట్ యొక్క కనిష్ట మరియు గరిష్ట మొత్తము ఎంత?
andhra
కనీస డిపాజిట్ మొత్తము రూ. 1 కోటి, గరిష్ఠ పరిమితి ఏమి లేదు. అయితే, రూ .10 కోట్లు పైన డిపాజిట్లను అంగీకరించడం/పునరుద్దరణ కొరకు బ్రాంచులు కార్పొరేట్ ప్లానింగ్ విభాగం, హెడ్ ఆఫీసు నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది

andhra డిపాజిట్ వడ్డీ రేటు నాకు ఎలా తెలుస్తుంది?
andhra


రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ విలువ కలిగి మరియు 7 రోజుల నుండి 179 రోజుల కనిష్ట గరిష్ట కల పరిమితులు గల domestic టెర్మ్ డిపాజిట్ల యొక్క వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు మా ప్రధాన కార్యాలయం ప్రకటిస్తుంది.


andhra డిపాజిట్ను ముందుగానే రద్దు చేసినా కూడా వడ్డీ రేటు వరిస్తుందా ?
andhra

వర్తించదు. ఇతర టెర్మ్ డిపాజిట్ల వలె ఈ డిపాజిట్ రన్నింగ్ లో ఉన్న కాల పరిమితి కి మాత్రమే తగిన వడ్డీ రేటు వర్తిస్తుంది. ఉదాహరణకు. 04/12/2014 తేదీన రూ. 5 కోట్ల డిపాజిట్ చేశారు, అప్పుడు దాని పూర్తి కాల పరిమితి కి వర్తించే వడ్డీరేటు 8.25% గా ఉంటుంది. ఒకవేళ ఈ డిపాజిట్ 7 మరియు 14 రోజులు మధ్య గాని లేదా 15 నుండి 45 రోజుల మధ్య గాని రద్దు చేసి ఉంటే వర్తించే రేటు 7.50% గా ఉంటుంది. అదేవిధంగా 46 రోజుల నుండి 90 రోజుల మధ్య గనుక రద్దు చేసి ఉంటే వర్తించే వడ్డీ రేటు 8.00% గా ఉంటుంది. అదేవిధంగా 91 రోజుల నుండి 179 రోజుల మధ్య రద్దు చేసి ఉంటే వర్తించే వడ్డీ రేటు 8.25% గా ఉంటుంది. అసలు కాలపరిమితికి ముందుగా రద్దు చేసిన డిపాజిట్ పై ఎటువంటి జరిమానా విడించబడదని దయచేసి గమనించండి. పై ఉదాహరణలో, 04/12/2014 తేదీన చేసిన డిపాజిట్ మరియు అది బ్యాంక్ లో ఉన్న కాలపరిమితి ఆధారంగా మాత్రమే వడ్డీరేటు వర్తించడం జరిగింది.

కొన్ని శాఖలు ఇప్పటికీ స్మార్ట్ ఛాయిస్ డిపాజిట్ పథకం పూర్తి వివరాలు తెలియక 7 రోజుల మరియు 179 రోజుల మధ్య రద్దు చేసిన డిపాజిట్ కు 8.25% వడ్డీ వర్తిస్తుందని భావిస్తున్నందువలన పైన వివరణాత్మక స్పష్టీకరణ ఇవ్వబడుతుంది.


andhra కనీస కాల పరిమితి తర్వాత డిపాజిట్ యొక్క అకాల రద్దు జరిమానా ఏమిటి?
andhra

కనీస కాల పరిమితి అనగా 7 రోజులు తర్వాత డిపాజిట్ యొక్క అకాల రద్దుకు ఎటువంటి జరిమానా ఉండదు.


andhra డిపాజిట్ రన్నింగ్ వ్యవధిలో ఏ సమయంలో పాక్షిక ఉపసంహరణ కు అనుమతి ఉందా?
andhra

అవును. డిపాజిట్ మొత్తంలో వినియోగదారుడు కొంత మొత్తాన్ని కోరుకున్న సందర్భంలో, డిపాజిట్ ముందుగానే రద్దు చేయబడుతుంది మరియు రన్ కాలానికి వర్తించే రేటు జరిమానా లేకుండా చెల్లించబడుతుంది. ఉపసంహరణ మొత్తాన్ని వినియోగదారునికి చెల్లించిన తర్వాత, మిగిలిన మొత్తాన్ని అసలు డిపాజిట్ తేదీ(పునరావృత్త తేదీతో) నుండి మరియు వాస్తవ వడ్డీ రేటు వాస్తవ డిపాజిట్ కాలానికి తిరిగి జమ అవుతుంది.

భాగ ఉపసంహరణకు నిబంధనలు:

  1. ఉపసంహరణ మొత్తం, ఈ పథకం కనీస డిపాజిట్ కంటే అనగా రూ .1.00 కోటి కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.

  2. తిరిగి జమ చేసే మొత్తము, ఈ డిపాజిట్ యొక్క కనీస డిపాజిట్ మొత్తం అనగా రూ . 1.00 కోటి కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.

  3. డిపాజిట్ అవశేష మొత్తం రూ .10 కోట్లు, కంటే ఎక్కువగా ఉంటే హెడ్ ఆఫీసు కార్పొరేట్ ప్లానింగ్ విభాగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

andhra ఇతర టెర్మ్ డిపాజిట్ పధకాలలో ఉన్నట్లు ఈ డిపాజిట్లో కూడా సీనియర్ సిటిజెన్ మరియు స్టాఫ్ కు అదనపు వడ్డీ రేటు అనువర్తిస్తుందా ?
andhra
లేదు కార్డు, రేటు మాత్రమే ఇస్తారు.



RD ప్లస్


andhra విడత కనీస మొత్తం ఎంత?
andhra
కనీస విడత మొత్తము రూ .100 / - మరియు రూ .100 / యొక్క గుణిజాలుగా లో - Rs.1,00,000/-. వరుకు గరిష్ట విడత మొత్తము ఉంటుంది.

andhra వాయిదా మొత్తాన్ని పెంచవచ్చా?అలా అయితే, ఎంత మొత్తంతో?
andhra
అవును. డిపాజిట్ పరిపక్వత ముందు ఏ నెలలో అయినా, అసలు వాయిదా మొత్తానికి 10 రెట్లు పెంచుకోవచ్చు. . ఉదా: అసలు వాయిదా మొత్తము రూ .100 / ఉంటే - రూ. 1000/- వరుకు .ఏ నెలలో అయినా జమ చేయవచ్చు.

andhra వడ్డీ ఎలా లెక్కిస్తారు?
andhra

నెల 10 వ మరియు చివరి రోజు మధ్య కనీస బ్యాలెన్స్ మీద నెలసరి ఉత్పత్తి ఆధారంగా ప్రతి త్రైమాసికంలో వడ్డీ చెల్లించబడుతుంది. సీనియర్ సిటిజన్స్ అదనపు వడ్డీ రేటు @ 0.50% కు అర్హులు.


andhra వాయిదా ఆలస్య చెల్లింపునకు మరియు ఖాతా ముందుగా రద్దు చేసిన ఎటువంటి జరిమానా చెల్లించవలసి ఉంటుంది?
andhra
వాయిదాలను ఆలస్యంగా చెల్లించిన యెడల ఎటువంటి జరిమానా చెల్లించక్కర్లేదు ఈ డిపాజిట్ ను ముందుగా మూసినపుడు ఎటువంటి జరిమానా లేకుండా, ఆ డిపాజిట్ యొక్క అసలు కాల పరిమితి మొత్తానికి టెర్మ్ డెపాజిట్ వడ్డిని చెల్లిస్తుంది

andhra .ఈ డిపాజిట్ కు TDS వర్తిస్తుందా లేదా?
andhra

ఈ డిపాజిట్లో పొందిన వడ్డిపై ఎటువంటి TDS వర్తించదు


andhra ఈ డిపాజిట్ కు వర్తించే వడ్డీ రేటు ఎంత?
andhra
ఇతర టెర్మ్ డిపాజిటల వలె డిపాజిట్ మొత్తము మరియు డిపాజిట్ కాల పరిమితిని అధారంగా చేసుకుని వడ్డీ రేటు నిర్ణయించ బడుతుంది.

andhra డిపాజిట్ ను ఆధారం గా చేసుకుని ఋణ సదుపాయం పొందగలమా?
andhra
డిపాజిట్ కాలం సమయంలో కనీసం రూ. 5000/- నుండి డిపాజిట్ విలువలో 90% వరుకు డిపాజిట్ లోన్ లేదా ఓవర్డ్రాఫ్ట్ పొందవచ్చు

andhra నామినేషన్ సౌకర్యం ఈ డిపాజిట్ అందుబాటులో ఉందా?
andhra
అవును. మార్గదర్శకాల మేరకు నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది.

chiclogo