Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు - MSME
MSME అంటే ఏమిటి?

MSMED చట్టం, 2006 ప్రకారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను MSME గా నిర్వచించ బడ్డాయి.

MSME క్రింద సంస్థలు ఎలా వర్గీకరించబడ్డాయి?

MSME క్రింద సంస్థలను అవి చేసే కార్యకలాపాలను బట్టి తయారీ మరియు సేవ అను రెండు వర్గాలుగా విభజించారు.
మైక్రో(సూక్ష్మ) సంస్థలు(తయారీ) అంటే ఏమిటి?

ఏ సంస్థ అయితే యంత్రపరికరాలు లో పెట్టుబడి రూ . 25 లక్షల మించదో, దానిని తయారీ విభాగం లో సూక్ష్మ సంస్థ (తయారీ) అంటారు.

మైక్రో సంస్థలు (సర్వీస్) అంటే ఏమిటి?

ఏ సంస్థ అయితే పరికరాలులో పెట్టుబడి రూ .10 లక్షలు మించదో, దానిని సేవ విభాగంలో సూక్ష్మ సంస్థ అంటారు .

చిన్నసంస్థలు (తయారీ విభాగం) అంటే ఏమిటి?

ఏ సంస్థ అయితే యంత్రపరికరాలు లో పెట్టుబడి రూ. 25 లక్షల కంటే తక్కువ కాకుండా మరియు రూ. 5 కోట్లు మించకుండా ఉంటుందో దానిని తయారీ విభాగంలో చిన్న సంస్థ గా భావిస్తారు.

చిన్నసంస్థలు (సేవ విభాగం) అంటే ఏమిటి?

ఏ సంస్థ అయితే పరికరాలు లో పెట్టుబడి రూ. 10 లక్షల కంటే తక్కువ కాకుండా మరియు రూ. 2 కోట్లు మించకుండా ఉంటుందో దానిని సేవ విభాగంలో చిన్న సంస్థ గా భావిస్తారు.
మధ్య తరహా సంస్థలు (తయారీ విభాగం) అంటే ఏమిటి?

ఏ సంస్థ అయితే యంత్రపరికరాలు లో పెట్టుబడి రూ. 5 కోట్ల కంటే తక్కువ కాకుండా మరియు రూ. 10 కోట్లు మించకుండా ఉంటుందో దానిని తయారీ విభాగంలో మధ్య తరహా సంస్థ గా భావిస్తారు.
మధ్య తరహా సంస్థలు (సేవ విభాగం) అంటే ఏమిటి?

ఏ సంస్థ అయితే పరికరాలు లో పెట్టుబడి రూ. 2 కోట్ల కంటే తక్కువ కాకుండా మరియు రూ. 5 కోట్లు మించకుండా ఉంటుందో దానిని సేవ విభాగంలో మధ్య తరహా సంస్థ గా భావిస్తారు.
సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు కొళ్లేటరల్ ఫ్రీ ఋణాలు మంజూరు కోసం పరిమితులు ఏమిటి?


సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు కొళ్లేటరల్ సెక్యూరిటి మరియు థర్డ్ పార్టీ గారెంటీ అవసరం లేకుండా రూ.10 లక్షల వరుకు ఋణాలను మంజూరు చేయవచ్చు.

ఇది, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) కింద మంజూరు చేసిన సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ఋణాలకు కూడా వర్తిస్తుంది.

సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కింద మిశ్రమ రుణాలు ఏమిటి?

మూలధన వ్యయం మరియు టెర్మ్ లోన్ అందించడం కోసం ఒక సింగిల్ విండో ద్వారా Rs.1.00 కోట్ల వరకు మిశ్రమ ఋణాలను మంజూరు చేస్తారు.
ఎల్‌యూ‌సి‌సి అంటే ఏమిటి?


లఘు ఉధ్యమి క్రెడిట్ కార్డును LUCC గా పిలవడం జరుగుతుంది. ఇది చిన్న వ్యాపారుల, రిటైల్ వ్యాపారులు, వృత్తి మరియు స్వయం ఉపాధి వ్యక్తుల, కళాకారులను & గ్రామ పరిశ్రమల, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ఋణ అవసరాలను తీర్చేందుకు గాను రూపొందించబడింది.

గత రెండు సంవత్సరాలుగా, ఖాతాలో సంతృప్తికరమైన లావాదేవీలను నడుపుతున్న అందరు వినియోగదారులు దీనికి అర్హులు.

ప్రతి ఋణగ్రహీతకు గరిష్టంగా రూ . 10 లక్షల వరుకు ఇవ్వడం జరుగుతుంది.

ఖాది మరియు గ్రామీణ పరిశ్రమ (KVI) రంగం కింద ఋణాలు మంజురు చేయడానికి గల ప్రక్రియ ఏమిటి?

ప్లాంట్ & యంత్రాలలో పెట్టిన అసలు పెట్టుబడి మొత్తం, కార్యక్రమాల పరిమాణం మరియు అవి స్థాపించబడిన ప్రదేశం తో సంబంధం లేకుండా ఖాది మరియు గ్రామీణ పరిశ్రమ రంగంలో ఉన్న అన్ని యూనిట్లు ఋణ మంజూరీకి అర్హులు.
ఋణాలకు ధర ఎలా నిర్ణయిస్తారు?


ఋణాలు వాటి వివిధ పరిమాణాల్లో అంతర్గత క్రెడిట్ రేటింగ్ నమూనాలు ఆధారంతో ధరను నిర్ణయిస్తారు.

ఎప్పటికప్పుడు పునర్విమర్శించబడుతున్న బేస్ రేటు మరియు వడ్డీ విస్తరణల ఆధారంగా ఈ వడ్డీ రేట్లు అనుసంధానించబడ్డాయి.

సిజిటిఎమ్ఎస్ఇ అంటే ఏమిటి?

ఈశాన్య ప్రాంతం కాకుండా ఏదేని ఇతర ప్రాంతాల్లో ఉన్నయూనిట్లకు రూ.5.00 లక్ష్లల వరుకు ఋణ సదుపాయంకు గారెంటీ ఫీ @1%గాను మరియు రూ.5.00 లక్ష్లల కంటే ఎక్కువ ఋణ సదుపాయంకు గారెంటీ ఫీ @1.5%గాను మరియు ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న యూనిట్లకు రూ.50 లక్షల వరుకు ఋణ సదుపాయానికి గారెంటీ ఫీ @0.75% గాను మరియు రూ. 50 లక్షల నుండి 100 లక్షల వరుకు ఋణ సదుపాయానికి గారెంటీ ఫీ @1.50% గాను ఉంటుంది.
వార్షిక సర్వీస్ ఫీజు ఎంత చెల్లించవలసి ఉంటుంది?


రూ. 5 లక్షల ఋణ సదుపాయానికి వర్తించే వార్షిక సర్వీసు ఫీజు @0.50%.

ఋణ గ్రహీత ఖాతాలో మంజూరు చేయబడిన ఋణ మొత్తం రూ.5.00 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, వాటికి వర్తించే వార్షిక సర్వీసు ఫీజు @0.75%

సి‌ఎల్‌సి‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి?

తయారీ విభాగం లోని సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు వాటి టెక్నోలజీని అభివృద్ది చేసుకొనుటకు క్రెడిట్ లింక్డ్ కాపిటల్ సబ్సిడీ పథకం.
సి‌ఎల్‌సి‌ఎస్‌ఎస్ క్రింద కాపిటల్ సబ్సిడీకి పరిమితి ఎంత?

మూలధన రాయితీ అనునది అర్హత గల ప్లాంట్ & యంత్రాలు మొత్తం మీద @15% గా ఉంటుంది మరియు ఇది గరిష్టంగా రూ .15.00 లక్షలు ఉంటుంది.
CLCSS పథకం క్రిందకి వచ్చే యూనిట్ల రకాలు ఏమిటి?

  • విస్తరణ లేకుండా లేదా విస్తరిస్తూ తమ యొక్క ఆర్ట్ టెక్నాలజి స్థితిని అభివృద్ది చేయాలనుకునే యూనిట్లు.
  • తగిన మరియు నిరూపితమైన టెక్నాలజీతో మాత్రమే సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న కొత్త యూనిట్లు.
బి‌సి‌ఎస్‌బి‌ఐ అంటే ఏమిటి?

బ్యాంకింగ్ కోడ్స్ మరియు భారతదేశం యొక్క ప్రామాణిక బోర్దుని బి‌సి‌ఎస్‌బి‌ఐ గా పిలుస్తారు

సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంక్ యొక్క నిబద్ధత కోడ్ ను రూపొందించారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (MSMED) చట్టం, 2006 ప్రకారం సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలతో బాంకులు వ్యవహరించేటపుడు బాంకులు అనుసరించవలిసిన కనీస ప్రమాణాలను ఈ కోడ్ లో పొందుపరచడం జరిగింది.
chiclogo