Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

         
 
 
 
 

ఎఫ్‌ఎక్యు-స్వల్పకాలిక రుణము

ఆంధ్రా బ్యాంక్ పట్టాభి ఎగ్రీ కార్డ్
 
  వివిధ పంటలకి కొలమానం ఎలా నిర్ణయించడం జరుగుతుంది? అది దేశ వ్యాప్తంగా సామాన్యమేనా?

జిల్లా స్థాయిలో, ఆయా జిల్లాల, జిల్లా స్థాయి సలహా కమిటీలు, ప్రతి సంవత్సరం, వ్యవసాయ వ్యయాన్నీ మరియు వివిధ పంటల ఫలసాయాన్నీ పరిగణనలోకి తీసుకుని, వివిధ పంటలకి, ఆర్ధిక రుణ సహాయ కొలమానం నిర్ణయిస్తాయి. ఆయా జిల్లాలకి చెందిన జిల్లా స్థాయి సలహా కమిటీలు, ప్రతి సంవత్సరం, వ్యవసాయ వ్యయం మరియు వివిధ పంటల ఫలసాయం పరిగణనలోకి తీసుకుని, వివిధ పంటల ఆర్ధిక రుణ సహాయ కొలమానం నిర్ణయించడం జరుగుతుంది. జిల్లాలలో కార్యకలాపాలు కొనసాగించే బ్యాంకులు అన్నీ, పంట రుణములు అందించే సమయంలో, డిఎల్‌టిసి ఆమోదించిన ఆర్ధిక రుణ సహాయ కొలమానం అనుసరిస్తాయి.

 
  డిఎల్‌టిసి సభ్యులు ఎవరు?

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు క‌న్వీనర్‌గా, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లాలో కార్యకలాపాలు కొనసాగించే వివిధ బ్యాంకుల జిల్లా కోఆర్డినేటర్స్, సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మరియు అభివృధ్ధి సాధించిన రైతులు, ఇతర సభ్యులుగా వ్యవహరిస్తారు.
 
  ప్రతి పంటకీ నిర్ణయించిన రుణ సహాయ కొలమానం కంటె అధికంగా అదనపు రుణ సహాయం లభించే ప్రోవిజన్ ఏదైనా వుందా?

ఔను. రైతులు అర్హుమైన ఆర్ధిక రుణ సహాయ కొలమానం కంటె, 20% అదనంగా పొందడానికి అర్హులు.
 
  రుణ పత్రాలు సమర్పించే సమయంలో రైతులకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఏమైనా వుందా?

ఆంధ్ర ప్రదేశ్ లో చిన్న మరియు మధ్య తరహా రైతులని, రు. 3.00 లక్షల క్రెడిట్ పరిమితి వరకూ స్టాం‌ప్ డ్యూటీ నుంచి మినహాయించడం జరిగింది.
 
  రైతు పంట రుణము వాయిదాల పధ్ధతి మీద తీసుకోవచ్చునా?

పట్టాభి అగ్రి కార్డ్ అంటే రివాల్వింగ్ క్రెడిట్ మరియు రైతులు తమకి నిర్ణయించిన పరిమితుల లోపల వాయిదాలలో రుణం పొందవచ్చు మరియు విక్రయించిన తరువాత లభించిన సొమ్ము ఖాతాలో జమ చెయ్యవచ్చు. ఈ ఖాతాలో మల్టిపుల్ క్రెడిట్స్ మరియు మల్టిపుల్ డెబిట్స్ అనుమతించడం జరుగుతుంది.
 
  రైతు, తన రుణ ఖాతాని పంట బీమా క్రింద పరిగణించ వద్దని, బ్రాంచికి ఆజ్ఞలు జారీ చెయ్యవచ్చునా?

లేదు, పంట బీమా, రుణగ్రహీతలైన రైతులందరికీ అనివార్యం. అర్హమైన పంటలన్నీ పంట బీమా పధకం క్రింద కవర్ చెయ్యవలసి వుంటుంది.
 
  వ్యవసాయ రుణములకి కొల్లేటరల్ సెక్యూరిటీ మరియు మార్జిన్ నియమాలు ఏమిటి?

రు. 1.00 లక్ష పరిమితుల వరకూ, ఎటువంటి మార్జిన్ మరియు ఎటువంటి కొల్లేటరల్ సెక్యూరిటీ కోసం ఒత్తిడి చెయ్యడం జరగదు.

 
  కవులు రైతులకీ మరియు జె‌ఎల్‌‌జి సముదాయాలకి సడలించిన సెక్యూరిటీ మరియు మార్జిన్ నియమాలు అర్హమౌతాయా?


ఔను.

 
  ప్రకటించిన పంటలకి పంట బీమా మాత్రమే కాకుండా, కిసాన్ కార్డ్ హోల్డర్స్ కి వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ (పెర్సనల్ యాక్సిడెంటల్ ఇ‌‌న్‌‌స్యూరె‌న్స్) కూడా లభిస్తుందా?

ఔను, వ్యక్తిగత ప్రమాద బీమా పధకం క్రింద, కెసిసి హోల్డర్స్‌కి, రు.50,000/- దాకా, వ్రమాద బీమా కవర్ లభిస్తుంది..

 
కిసాన్ సంపత్తి
 
  కిసాన్ సంపత్తి రుణములు ఎందుకోసం?


తాము నిలవచేసుకున్న ఫలసాయం ఆధారంగా రుణము పొంది, ఆత్యవసర ఖర్చులని భరించడంకోసం, గత్యంతరం లేక ఫలసాయం విక్రయించే పరిస్థితి నివారించడానికి పంట రుణ గ్రహీతలైన రైతులకి కల్పించే సదుపాయం.

 
  రుణగ్రహీతలు కాని రైతులుకూడా, కిసాన్ సంపత్తి క్రింద రుణ సహాయానికి అర్హులేనా?


ఔను.

 
chiclogo