Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఎన్నారై ఉత్పత్తులు మరియు సేవలు


నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (రూపాయి) ఖాతా

సాధారణంగా ఖాతాలు తెరవడానికి గల ముఖ్య ఉద్దేశం

వినియోగదారుడు స్వదేశానికి డబ్బు పంపడానికి ఆసక్తి కలిగియుండి మరియు పన్ను ప్రయోజనాలు కూడా పొందగోరితే, ఖాతా లో ఉన్న నగదుకు పన్ను ఉండదు కాబట్టి NRE ఖాతాలు అనుకూలంగా ఉంటాయి.

ఖాతా నిర్వహించబడుతున్న కరెన్సీ

భారత రూపాయి

టెర్మ్ డిపాజిట్ కాల వ్యవధి

ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల వరకు

ఉమ్మడి ఖాతాలు

ఇతర ఎన్నారైలు తో అనుమతించిన

ఖాతాల నిర్వహణ

ఉత్తరువు లేదా వ్యవహారాధికారం గల వారిని నియమించవచ్చు. వ్యవహారాధికారం గల వారి అధికారాలు స్థానిక చెల్లింపులకు లేదా యోగ్యతగల పెట్టుబడులు లేదా ఖాతాదారు సొంత చెల్లింపులకు మాత్రమే పరిమితమయ్యాయి.

వడ్డీ రేట్లు

ప్రస్తుత రేట్లు:
టర్మ్ డిపాజిట్లు: తాజా వడ్డీ రేట్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

నిధుల మూలము

విదేశాల నుంచి చెల్లింపులు / ఇతర NRE / FCNR ఖాతాల నుండి బదిలీ

టర్మ్ డిపాజిట్లపై ఋణాలు

అనుమతించబడ్డాయి. లోన్ అర్హత: డిపాజిట్ విలువలో 85%, ప్రస్తుత గరిష్ట మొత్తం రూ .100 లక్షలు (ఇది ఆర్బిఐ నిబంధనల ప్రకారం మారే అవకాశం కలదు)
టర్మ్ డిపాజిట్లపై రుణాలను తిరిగి ఋణం ఇవ్వడం కోసం లేదా వ్యవసాయం కొరకు లేదా ప్లాంటేషన్ కార్యక్రమంపై న లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం వినియోగించే సాధ్యం కాదు.
వివరాలకు సందర్శించండి:
మరింత తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

అకాల రద్దు

అనుమతించబడినది. 1 సంవత్సరం పూర్వం చేస్తే వడ్డీ చెల్లించనవసరం లేదు. ఒక సంవత్సరం తరువాత రద్దు చేస్తే 1% శిక్షా రుసుము వర్తించును

పన్ను ప్రయోజనాలు

పన్ను లేదు

నామినేషన్లు

అనుమతించబడినవి. నామినీ రెసిడెంట్ లేదా నాన్-రెసిడెంట్ / PIO కావచ్చు.

స్వదేశానికి తిరుగు చెల్లింపులు (Repatriation/Repayment)

చేయవచ్చును. సంపాదించిన వడ్డీ తో సహా భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు సంబంధం లేకుండా భారతదేశం వెలుపల గల స్వదేశానికి చేయవచ్చు. జమ ఎక్స్చేంజ్ రిస్క్ ను ఖాతాదారుడే భరించవలసి ఉంటుంది.

కావలసిన పత్రాలు / పరిచయం

  1. .వ్యక్తిగతంగా ఖాతా తెరవడం:

    1. పాయింట్ 4 లో కింద ఇవ్వబడిన విధంగా కావలసిన పత్రాలను జతపరచి ఖాతాదారుడు భారతదేశం దర్శించినప్పుడు అప్లికేషన్ సమర్పించవచ్చు.

    2. కస్టమర్ దుబాయ్ మరియు USA లలో కల మా ప్రతినిధి కార్యాలయాలలో కూడా అప్లికేషన్ సమర్పించవచ్చు.



  2. విదేశాల నుంచి ఖాతా తెరవడం:

    1. కస్టమర్ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని సీరియల్ నెంబర్ 4 లో పేర్కొనిన పత్రాలను జతపరచి సమర్పించవచ్చు.
    2. కస్టమర్ అప్లికేషన్ స్కాన్ చేసి కావలసిన పత్రాలను జతపరచి

    3. మరియొక అదనపు పత్రం ధృవీకరించి (అటెస్టెడ్) పంపవచ్చు.


  3. .కస్టమర్ అప్లికేషన్ స్కాన్ చేసి పంపేట్లైతే అనుసరించదగిన పద్ధతి ఈ విధంగా ఉంటుంది :

    1. ఆవరణలతో పాటు స్కాన్ చేసిన అప్లికేషన్ యొక్క సాఫ్ట్ కాపీని బ్రాంచ్ ఇ-మెయిల్ చిరునామాకు పంపి ఖాతా తెరవడానికి అభ్యర్థించవచ్చు.
    2. స్కాన్ చేసిన అప్లికేషన్ మరియు ఆవరణలు బ్రాంచ్ వారు డౌన్ లోడ్ చేసి పత్రాలు క్రమంలో ఉంటే ఖాతా తెరుస్తారు.
    3. అప్లికేషన్ లో ఇచ్చిన ఇ-మెయిల్ చిరునామాకు బ్రాంచ్ కస్టమర్ ఖాతా సంఖ్యను తెలియజేస్తుంది
    4. మెయిల్ అందిన తర్వాత, కస్టమర్ సరైన బ్యాంకింగ్ విభాగాలు అంటే, ఎ) తన విదేశీ బ్యాంకు ఖాతా పై జారీ చేసిన చెక్ ద్వారా లేదా బి) ఎబి SPEEDWAY (యూ‌ఎస్ కస్టమర్ అయిన పక్షంలో) ద్వారా లేదా సి) త్వరిత బదలాయింపు / NEFT ద్వారా (మధ్య తూర్పు దేశాల వారైతే) లేదా డి) స్విఫ్ట్ చెల్లింపు (US & మధ్య తూర్పు దేశాల వారైతే) ద్వారా మరియు ఇతర సరైన బ్యాంకింగ్ విభాగాలు ద్వారా ప్రారంభ చెల్లింపు చేయవచ్చు.
    5. ప్రాధమిక చెల్లింపు అందిన తర్వాత అప్లికేషన్ లో ఇచ్చిన మెయిలింగ్ చిరునామాకు - చెక్ బుక్, వ్యక్తిగతేతర డెబిట్ కార్డ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎంచుకొని ఉంటే) ఉన్న కిట్ పంపబడుతుంది.
    6. కస్టమర్ తన తదుపరి భారతదేశ సందర్శనలో బ్రాంచ్ ను సందర్శించవలసిందిగా సూచించడమైనది.
    7. అప్లికేషన్ లో ఖాళీ లు లేకుండా నింపవలెను.


  4. కింద ఇవ్వబడిన విధంగా పత్రాలు జతపరచండి:

    1. సరైన రెసిడెంట్ వీసా మరియు భారతీయ చిరునామా పేజీ కల పాస్ పోర్ట్ ప్రతులు
    2. మెయిలింగ్ చిరునామా రుజువు (భారతీయ లేదా విదేశీ)
    3. మెయిలింగ్ చిరునామా రుజువుగా అంగీకరించబడు పత్రాల జాబితా

      (కిందివాటిలో ఏదైనా ఒకటి)

      మెయిలింగ్ చిరునామా ఓవర్సీస్ చిరునామా అయితే:

      1. పాస్పోర్ట్ యొక్క నకలు ప్రతి
      2. మూడు నెలల వ్యవధి మించని వినియోగ బిల్లు యొక్క నకలు ప్రతి
      3. మూడు నెలల వ్యవధి మించని విదేశీ బ్యాంకు స్టేట్మెంటు యొక్క నకలు ప్రతి
      4. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క నకలు ప్రతి
      5. ప్రభుత్వం చే జారీ చేయబడ్డ గుర్తింపు కార్డు యొక్క నకలు ప్రతి
      6. మూడు నెలల వ్యవధి మించని క్రెడిట్ కార్డు బిల్లు యొక్క నకలు ప్రతి
      7. లీజు ఒప్పందం / అద్దె రసీదు ( 3 నెలలకు పాతది కాని) నకలు ప్రతి
      8. అపాయింట్మెంట్ లెటర్ యొక్క నకలు ప్రతి
      9. చిరునామాగల కంపెనీ ID కార్డు నకలు ప్రతి
      10. కంపెనీ లెటర్ హెడ్ మీద ఖాతా తెరిచే ప్రయోజనం కోసం జారీ చేసిన అసలు లేఖ
      11. ఏదేని ఇతర బ్యాంకు లో గల మీ ఎన్నారై ఖాతా బ్యాంకు స్టేట్మెంట్ లేదా ఖాతా పుస్తకము యొక్క నకలు ప్రతి
      12. స్పాన్సర్ కు ప్రాధమిక దరఖాస్తుదారునికి మధ్య సంబంధ రుజువుతో పాటు స్పాన్సర్ యొక్క చిరునామా రుజువు
      13. విదేశీ చిరునామా గల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు నకలు ప్రతి
      మెయిలింగ్ చిరునామా ఒక భారతీయ చిరునామా అయితే :

      1. చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ యొక్క నకలు ప్రతి
      2. చెల్లుబాటు అయ్యే శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు యొక్క నకలు ప్రతి
      3. రెండు నెలలకంటే ముందుది కాని టెలిఫోన్ బిల్లు యొక్క నకలు ప్రతి (ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆపరేటర్లవి ఉదా: ఎం‌టి‌ఎన్‌ఎల్, బి‌ఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్, ఎయిర్టెల్ & టాటా ఇండికాం) - ఖాతా తెరిచే తేదీకి 2 నెలల ముందు మించకుండా
      4. విద్యుత్ బిల్లు నకలు ప్రతి - ఖాతా తెరిచే తేదీ 2 నెలల ముందు మించకుండా
      5. బ్యాంకు పాస్ బుక్ లేదా బ్యాంక్ ఖాతా స్టేట్మెంటు నకలు ప్రతి - ఖాతా తెరిచే తేదీకి 3 నెలల ముందు మించకుండా
      6. రేషన్ కార్డు నకలు ప్రతి
      7. చిరునామా గల ఎన్నికల కార్డు / ఓటర్ ID యొక్క నకలు ప్రతి

    4. ఉద్యోగ ఒప్పందం యొక్క నకలు ప్రతిని మరియు తాజా పే స్లిప్ (ఉద్యోగుల విషయంలో) యొక్క నకలు ప్రతి.
    5. విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ నుంచి లేఖ లేదా గుర్తింపు కార్డు యొక్క నకలు ప్రతి (ఎన్నారై స్టూడెంట్స్ అయిన పక్షంలో)
    6. అన్ని కాపీలు ఒరిజినల్స్ యొక్క నిజమైన నకల్లు అని కస్టమర్ నుండి ఒక డిక్లరేషన్.
    7. స్వయంగా ధృవీకరించిన (self attested) కింది వాటిలో ఏదేని ఒక అదనపు పత్రము

      1. విదేశాలలోని ఒక బ్యాంకు ఖాతా పై తీసిన ఒక చెక్
      2. సంతకం, బ్యాంకు పేరు, ఖాతా సంఖ్య మొదలైనవి గల ఏదైనా ఒక కాన్సెల్ చేసిన చెక్కు
      3. 3 నెలల కు మించి పాతది కాని విదేశీ / ఇండియన్ బ్యాంకు స్టేట్మెంట్ యొక్క నకలు ప్రతి
      4. 3 నెలల కు మించి పాతది కాని వినియోగ బిల్లు యొక్క నకలు ప్రతి
      5. ID కార్డు యొక్క నకలు ప్రతి ఉదా: డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగుల ID, లేబర్ కార్డ్ వంటి
      6. స్థానిక ప్రభుత్వము చే జారీ చేయబడ్డ ఐ డి కార్డ్ యొక్క నకలు ప్రతి
      7. ఖాతా తెరవడానికి యజమాని(employer) జారీ చేసిన లేఖ అసలు ప్రతి
      8. క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ (3 నెలలకు మించి పాతది కాని) యొక్క ప్రతి
      9. లీజు కాపీ / అద్దె ఒప్పందం/ అద్దె రసీదు (3 నెలలకు మించి పాతది కాకూడదు)

అప్లికేషన్

ఇక్కడ క్లిక్ చేయండి అప్లికేషన్ డౌన్లోడ్

chiclogo