Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పనా పథకం (పి‌ఎం‌ఈ‌జి‌పి)


భారత ప్రభుత్వం, ఎం‌ఎస్‌ఎం‌ఈ మంత్రిత్వ౦ ఇదివరకే ఉన్న రెండు స్కీములు ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన మరియు పాగ్రామీణ ఉపాధి కల్పన పథకం (ఆర్ఈజీపీ) విలీనం ద్వారా ఒక కొత్త క్రెడిట్ లింక్ సబ్సిడీ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకై ప్రవేశపెట్టారు.

ఉద్దేశ్యం

  • కొత్త స్వయం ఉపాధి వెంచర్లను / చిన్న పరిశ్రమలను స్థాపించి, వాటి ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలు అలాగే దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తి చేయడానికి
  • పట్టణ ప్రాంతాలకు గ్రామీణ యువత తరలిపోకుండా, సంప్రదాయ మరియు భావి కళాకారులు మరియు గ్రామీణ & పట్టణ నిరుద్యోగ యువతకు నిరంతరంగా ఉపాధి కల్పించటం.
  • చేతివృత్తుల వారి వేతనాలను సంపాదించే సామర్ధ్యాన్ని పెంచి తద్వారా గ్రామీణ, పట్టణ ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు అభివృద్ధికి దోహదం.
అర్హత

  1. వయసు 18 సంవత్సరాలు పైన గల వ్యక్తి,
  2. పి‌ఎం‌ఈ‌జి‌పి కింద ప్రాజెక్టులు ఏర్పాటు చెయ్యడానికి ఆదాయపరిమితి లేదు. కానీ ఈ సౌకర్యం పి‌ఎం‌ఈ‌జి‌పి కింద అధికారికంగా మంజూరు చేయబడిన కొత్త ప్రాజెక్టులకు మాత్రమే.
  3. వ్యాపార / సేవా రంగంలో Rs.5.00 లక్షల పైన మరియు తయారీ రంగంలో Rs.10.00 లక్షల పైన ఖరీదు గల ప్రాజెక్టుల ఏర్పాటుకు, లబ్ధిదారులు కనీసం ఎనిమిదవ తరగతి పాస్ విద్యార్హత కలిగి ఉండాలి.
  4. స్వయం సహాయక బృందాలు (ఏ ఇతర పథకాల కింద ప్రయోజనాలు పొందని బిపిఎల్ కు చెందిన వారితో కలిపి) అర్హులు.
  5. (వ్యక్తి మరియు తన భార్య/భర్త కలిపి) ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు
  6. ఇప్పటికే ఉన్న యూనిట్లు / ఏ ఇతర పథకం కింద అయినా ప్రభుత్వం సబ్సిడీ వాడుకున్న యూనిట్లకు అర్హత లేదు.
  7. గ్రామీణ పరిశ్రమలతో సహ సాధ్యపడే అన్ని కొత్త సూక్ష్మ సంస్థలకు వర్తిస్తుంది (ప్రతికూల జాబితాలో ఉన్న వాటికి తప్ప).
ప్రాజెక్టు వ్యయం సీలింగ్

  1. ప్రాజెక్ట్ / యూనిట్ కు తయారీ రంగం క్రింద అనుమతించదగిన గరిష్ట ధర Rs.25.00 లక్షలు.
  2. వ్యాపార/సేవా రంగం క్రింద అనుమతించదగిన ప్రాజెక్ట్ / యూనిట్ యొక్క గరిష్ట ధర RS.10.00 లక్షలు
బ్యాంక్ ఫైనాన్స్

  1. 90% జనరల్ కేటగిరీ విషయంలో
  2. 95% ప్రత్యేక కేటగరి విషయంలో
లబ్ధిదారుల సహకారం

  1. జనరల్ వర్గం కోసం: ప్రాజెక్టు ఖరీదులో 10%
  2. ఎస్సీ/ ఎస్టీ / ఓబీసీ / మైనారిటీలు / మహిళలు, ఎక్స్ సర్వీస్, వికలాంగులు మొదలగు ప్రత్యేక కేటగిరీలకు ప్రాజెక్ట్ ఖర్చులో 5%.
సబ్సిడీ రేటు

పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు
జనరల్ కేటగిరీ ప్రాజెక్టు ఖర్చులో 15% ప్రాజెక్టు ఖర్చులో 25%
ప్రత్యేక కేటగిరి
ప్రాజెక్టు ఖర్చులో 25% ప్రాజెక్టు ఖర్చులో 35%
అమలు చేయు సంస్థలు

జాతీయ స్థాయి రాష్ట్ర డైరెక్టరీల వద్ద ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ), ముంబై. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఖాది గ్రామీణ పరిశ్రమల బోర్డులు (కే‌వి‌ఐ‌బి) మరియు జిల్లా పారిశ్రామిక కేంద్రాలు

గుర్తింపు

కే‌వి‌ఐ‌సి/ రాష్ట్ర కే‌వి‌ఐ‌బి మరియు రాష్ట్ర డి‌ఐ‌సి లు మరియు బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా స్థాయిలో చేయబడుతుంది.
{2}తిరుగు చెల్లింపు (రీపేమెంట్){/2}

నియమిత బ్యాంక్ నిర్దేశించిన మొదటి మోరటోరియం తరువాత 3 నుండి 7 సంవత్సరాల వరకు.
chiclogo