Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

andhra telugu
 
ఆధార్ సీడింగ్
 
 ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆధార్ నంబరు నమోదు:

వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్దిదారుల బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకూ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (EBT ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) కోసం ఆ ఖాతాలకి ఆధార్ సంఖ్యని అనుసంధానం (సీడింగ్) చేసేందుకూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రయోజనాలు నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడుతుంది. ఈ ప్రయోజనాలు పొందగోరేవారు, బ్యాంక్ ఖాతాకు తమ ఆధార్ నెంబరుని అనుసంధానం (సీడింగ్) చేయించుకోవటం తప్పనిసరి చేశారు.

గౌరవనీయులైన మా కస్టమర్ల సౌకర్యం కోసం, వారు తమ ఆధార్ నెంబరు సీడింగ్ అభ్యర్థనలని సమర్పించేందుకు మా బ్యాంక్ అనేక ఛానెళ్ళని ప్రారంభించింది.

సమర్పించిన ఆధార్ వివరాలు సరైనవని ధృవీకరణ చేసుకున్న తర్వాతనే పై అభ్యర్థనలని బ్యాంకు ప్రాసెస్ చేస్తుంది.

ఆధార్ సీడింగ్ అభ్యర్థనలని సమర్పించేందుకు ఈ కింది ఛానెళ్లు అందుబాటులో ఉన్నాయి:
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆధార్ నెంబరు నమోదు: (రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం మాత్రమే):

    • కస్టమర్, తన యూజర్ ఐడి (User ID) మరియు పాస్ వర్డుని ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కి లాగిన్ కావాలి.
    • హోమ్ పేజీ లోని "ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఆధార్ సంఖ్య నమోదు" లింక్ పై క్లిక్ చేయాలి.
    • సూచించిన చోట 12 అంకెల ఆధార్ నెంబరుని ఎంటరు చేసి, .మరో సారి దాన్ని నిర్ధారించాలి.
    • ఆధార్ సంఖ్యని సేడ్ చేయ వలసిన సేవిం.గ్సు ఖాతాని ఎంచుకోవాలి.
    • ఆధార్ నెంబరు నమోదు మరియు నిరాకరణ (రిజెక్షన్) గురించి తెలుసుకునేందుకు "ఎంక్వైరీ" పై క్లిక్ చేయాలి.

  • ఆంధ్రా బ్యాంక్ ఎటిఎం (ATM) ల ద్వారా ఆధార్ నెంబరు నమోదు:

    • కస్టమర్, ఆంధ్రా బ్యాంక్ కి చెందిన ఏ ఎటిఎం (ATM) లో నైనా ఎటిఎం (ATM) లేదా డెబిట్ కార్డు ఇన్సర్ట్ చేసి, సేవలు (Services) కేటగరీ కింద ఇచ్చిన ఆధార్ నమోదు (Aadhaar Registration) ని ఎంపిక చేసుకోవాలి.
    • ఆధార్ నెంబరుని రెండుసార్లు ఎంటర్ చేయమని ఎటిఎం (ATM ) సూచిస్తుంది.
    • .ఆధార్ నెంబరుని రెండు సార్లు ఎంటర్ చేసిన తర్వాత, కస్టమర్ అభ్యర్థన అందినట్లు ఎటిఎం (ATM ) నుండి రశీదు వస్తుంది.

  • SMS ద్వారా ఆధార్ నెంబరు నమోదు:

    • ఈ సౌకర్యం, మొబైల్ అలర్టుల కోసం బ్యాంకులో నమోదు చేసుకున్న వినియోగదారులకి మాత్రమే లభ్యం అవుతుంది. .
    • SMS ఈ కింది వాక్యనిర్మాణం (Syntax) లో వుండాలి.
      • ఆధార్ <space> 15 అంకెల బ్యాంకు ఖాతా సంఖ్య <space> 12 అంకెల ఆధార్ సంఖ్య AADHAAR <space> 15 digit Bank Account Number <space> 12 digit AADHAAR Number
      • పై సందేశం (SMS) లో "ఆధార్" ( AADHAAR) అనే పదం కీవర్డ్ (కీలక పదం) గా వుంటుంది.
    • ఆధార్ సంఖ్య విజయవంతంగా నమోదు అయిన తర్వాత కస్టమర్లు, ఒక సందేశాన్ని (SMS) తమ మొబైల్ ఫోనులో అందుకుంటారు.
గమనిక: కస్టమరు ఖాతాకి విజయవంతమైన ఆధార నెంబరు నమోదు అయినప్పుడు మరియు ఖాతాకి ఆధార్ సంఖ్య అనుసంధానాన్ని తొలగించినప్పుడు ఒక SMS అలర్టుని ఆ కస్టమరు యొక్క నమోదిత మొబైల్ నంబరుకి బ్యాంకు పంపిస్తుంది.

 
 
chiclogo