దిగుమతిదారులు/ఎగుమతిదారులు తమ గత 3 ఆర్ధిక సంవత్సరాల (ఏప్రిల్ - మార్చి) సగటు వాస్తవ ఎగుమతి/దిగుమతిల టర్నోవర్ లేదా గత సంవత్సర వాస్తవ ఎగుమతి/దిగుమతుల టర్నోవర్(ఏది ఎక్కువ ఉంటే అది) మరియు declaration of an exposure ను ఆధారంగా చేసుకుని దిగుమతిదారుల/ఎగుమతిదారులు forward contracts ను బుక్ చేసుకునేందుకు అనుమతించడం జరిగింది.
ఒక సంవత్సరంలో మరియు ఏ సమయంలో అయినా బుక్ చేసిన forward contracts వాటి అర్హత పరిమితి( అనగా గత 3 ఆర్ధిక సంవత్సరాల (ఏప్రిల్ - మార్చి) సగటు వాస్తవ ఎగుమతి/దిగుమతిల టర్నోవర్ లేదా గత సంవత్సర వాస్తవ ఎగుమతి/దిగుమతుల టర్నోవర్(ఏది ఎక్కువ ఉంటే అది)) ను మించకూడదు. అదనపు 75% అర్హత పరిమితి ఉన్న కాంట్రాక్ట్స్ బట్వాడా ఆధారంగా ఉంటాయి మరియు రద్దు చేయబడవు. ఈ పరిమితులు దిగుమతి / ఎగుమతి లావాదేవీల కోసం ప్రత్యేకంగా లెక్కించబడతాయి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ పరిమితి వార్షిక సంచిత పరిమితి. ఈ పరిమితి గత పనితీరు సదుపాయం క్రింద బుకింగ్ మేరకు తగ్గిస్తారు కానీ మరలా అనుమతించరు.
|