Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


 




ఖాతాదారుల కార్నర్ »సమాచార హక్కు

ఆంధ్ర బ్యాంకు, హక్కు సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ఈ కింది సమాచారాన్ని మీ ముందు వుంచడం జరిగింది.





సమాచార హక్కు చట్టం ఏమిటి?


సమాచార హక్కు ఏమిటి?


ఎవరు సమాచారాన్ని అడగవచ్చు?


ఎవరు సమాచారాన్నిఇస్తారు?


బహిర్గతం చేయడం నుంచి మినహాయింపు పొందిన సమాచారం


సమాచార అభ్యర్థనకి విధానం


సూచించిన ఫీజు చెల్లింపు విధానం


అప్లికేషన్ రుసుము


అందించిన సమాచారం కోసం ఖర్చు కోసం చెల్లింపులు


అప్లికేషన్ రుసుము చెల్లింపు మరియు కొన్ని సందర్భాలలో, సమాచారం అందించడంలో వచ్చు ఖర్చుల మినహాయింపు కోసం



సమాచారాన్ని అందించడానికి పట్టు ప్రతిస్పందన సమయం


తిరస్కరణకి గల కారణాలు


పాక్షికంగా బహిర్గతం చేయు సమాచారం


ఆంధ్రా బ్యాంక్ లో ప్రజా సమాచార అధికారుల నిర్మాణం


సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CAPIO)


సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు (cpio)


అప్పీలేట్ అధికారులు


ఆంధ్రా బ్యాంక్ లో ఒక ప్రజా సమాచార అధికారిని గుర్తించడం ఎలా?








సమాచార హక్కు చట్టం ఏమిటి?



***** భారతదేశం యొక్క ప్రభుత్వం పౌరులు ఏ పనిలో నైనా, పబ్లిక్ సంస్థల నియంత్రణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి క్రమంగా సమాచార ప్రాప్తితో సురక్షిత సమాచార హక్కు ఆచరణ జరగాలనే ముఖ్యఉద్దేశ్యంతో ఈ "సమాచార హక్కు చట్టం 2005" చట్టంను అందించింది. ఈ చట్టం 15.06.2005 న ఆచరణలోకి వచ్చినా, 12.10.2005 న పూర్తిగా అమల్లోకి వచ్చింది.







సమాచార హక్కు ఏమిటి?



***** సమాచారం హక్కు కింద ఏ ప్రభుత్వ సంస్థ యెుక్క నియంత్రణతో లేదా కింద జరిగిన పనులు మరియు వివరాలు తెలుసుకోవడం లేదా డాక్యుమెంట్లు/ రికార్డులను, సర్టిఫికేట్ కాపీలు మరియు సర్టిఫికేట్ నమూనాలు తీసుకోబడతాయి మరియు ఎలక్ట్రానిక్ రూపంలో నిల్వవున్న సమాచారం కూడా ఇది సంపాదించేందుకు సహకారం ఇస్తుంది.







ఎవరు సమాచారాన్ని అడగవచ్చు?



***** ఏ పౌరుడైనా రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఇంగ్లీష్/ హింది/ అప్లికేషన్ ను సూచించిన ఫీజు తో కలిసి చేసి ఆ ప్రాంతాల్లోని, అధికారిక భాషలో దరఖాస్తు చేసుకుని సమాచారాన్ని అభ్యర్థించవచ్చు.







ఎవరు సమాచారాన్నిఇస్తారు?



***** ఏ ప్రభుత్వ సంస్థ ఐనా అవసరం సమాచారాన్నిఅందించడం కోసం వివిధ స్థాయిలలో సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లను (CAPIO) ఏర్పాటు చేసే వాల్లచే ప్రజలు కోరిన సమాచారం అన్ని పరిపాలనా యూనిట్లలో / కార్యాలయాలలో కేంద్ర పౌర సమాచార అధికారులు(cpio) తీసుకొని మరియు సమాచారాన్ని చట్టం క్రింద నిర్దిష్టంగా అనుమతించిన మేరకు ప్రజలకు అందిస్తారు. అలాగే ప్రజా అధికారులు సీనియర్ cpio అధికారిని అప్పేలెట్ అథారిటీ గా చట్టం కింద cpio ఇచ్చు నిర్ణయాలను విశ్లేషించడం జరుగుతుంది. ఏ వ్యక్తి కైనా cpio నుండి సరైన నిర్దిష్ట సమయం లోపు అనగా 30 రోజుల లోపు సమాచారం లేక పోతే వారు వెంటనే అప్పేలెట్ అథారిటీ ముందు వారి అప్పీలును వుంచవచ్చు.







బహిర్గతం చేయడం నుంచి మినహాయింపు పొందిన సమాచారం



***** సెక్షన్లు 8 మరియు 9 కింద పౌరులకు సమాచారంలోని కొన్ని వర్గాలని బహిర్గతం చేయడం నుంచి మినహాయింపుని, చట్టం అందిస్తుంది. ప్రజలు కూడా సమాచారం కోసం అభ్యర్థన సమర్పించే ముందు చట్టం యొక్క ఈ విభాగాల గురించి తెలుసుకొని చేయాలి.







సమాచార అభ్యర్థనకి విధానం



***** సమాచారం కోరుతూ ఏ వ్యక్తిఐనా, ఏదైనా అభ్యర్థనను మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఇంగ్లీష్ లేదా హిందీ లేదా ఆ స్థానిక ప్రాంత అధికారిక భాషలో గాని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి(CPIO) తాను కోరిన సమాచారం వివరములను ఆ అధికారిక భాషలో పేర్కొనడం ద్వారా సూచించిన ఫీజు చెల్లించి తెలుసుకొనవచ్చు. మౌఖిక అభ్యర్థనలను రాతలకి ప్రోత్సహించడం.
***** సమాచారాన్ని కోరే వ్యక్తి ఏ కారణాలను ఇవ్వనక్కరలేదు.
***** సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CAPIO)గా నియమించబడ్డ బ్రాంచ్ మేనేజర్లు ఏ వ్యక్తి నుండి ఐనా అభ్యర్థనని అంగీకరించి, జోనల్ కార్యాలయాలు మరియు హెడ్ ఆఫీసు వద్దవున్న తొలి మరియు రెండవ స్థాయి అధికారులుగా వున్న కేంద్ర ప్రజా సమాచార అధికారులు (CPIOs) మరియు సీనియర్ కేంద్ర ప్రజా సమాచార అధికారుల(SCPIOs) వద్దకు వారి నిర్ణయం కొరకు పంపాలి.







సూచించిన ఫీజు చెల్లింపు విధానం










అప్లికేషన్ రుసుము



ఆర్టిఐ రూల్స్, 2005(ఫీజు రెగ్యులేషన్ మరియు వ్యయాలు) రూల్ 3 ప్రకారం సరైన డిమాండ్ డ్రాఫ్ట్ లేదా బ్యాంకర్స్ చెక్కును లేదా రూ. 10/- నగదును పబ్లిక్ అథారిటీ అకౌంట్స్ ఆఫీసర్ కి చెల్లించవలసిన విధంగా - ఆసక్తి వ్యక్తి సమాచారం కోరుతూ వ్రాయడంతో తన అభ్యర్థనను సమర్పించవచ్చు. ఆ తరువాత నుండి 17.05.2006 నాటి అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కూడా అంగీకరించబడినది.







అందించిన సమాచారం కోసం ఖర్చు కోసం చెల్లింపులు



***** ఒక వేల కోరిన సమాచారం cpio ద్వారా ఇవ్వదగినది అయితే, ఆ వ్యక్తి సమాచార ముద్రణ యొక్క వాస్తవ ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది. ఖర్చు లెక్క వివరాలు రాతలో దరఖాస్తుదారుడికి అందించాలి.
***** దరఖాస్తుదారుడు తాను చెల్లించాల్సిన ముద్రణా చార్జీల మీద ఆక్షేపణలను అప్పేలెట్ అథారిటీ ఐన జనరల్ మేనేజర్ల దృష్టికి తీసుకు వెల్లవచ్చును.
సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ 1 కింద సమాచారాన్ని అందించడం కోసం, రుసుము సరైన రసీదు కలిగిన డిమాండ్ డ్రాఫ్ట్ లేదా బ్యాంకర్స్ చెక్కును క్రింది రేట్లు వద్ద పబ్లిక్ అథారిటీ అకౌంట్స్ ఆఫీసర్ కు చెల్లించవలసిన నగదు ద్వారా వసూలుకు నిర్ణయించబడ్డాయి.

ఎ) ప్రతి పేజీకి రూ .2 (A4 లేదా A3 సైజు కాగితం) చేసిన లేదా కాపీకి
బి) పెద్ద సైజు కాగితం యధార్త ఛార్జ్ లేదా ఒక కాపీ గిట్టుబాటు ధర
నమూనాల వాస్తవ వ్యయం లేదా వాటి ధర
డి) రికార్డులు పరిశీలించడానికి మొదటి 1టవ గంట కోసం ఎలాంటి రుసుము లేదు మరియు అక్కడనుండి ప్రతి 15 నిమిషాలకి రూ .5 చార్జి ఆ తర్వాత వసూలు చేస్తారు.
ఇ) డిస్కు లేదా ఫ్లాపీ ద్వారా అందించిన సమాచారం కోసం రూ . 50/- వసూలు చేస్తారు.










అప్లికేషన్ రుసుము చెల్లింపు మరియు కొన్ని సందర్భాలలో, సమాచారం అందించడంలో వచ్చు ఖర్చుల మినహాయింపు కోసం




***** దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నఅభ్యర్థులకు వారు చేసే అప్లికేషన్ రుసుము మరియు ఖర్చులు సమాచారం పొందడంలో వెచ్చించే వ్యయం నుంచి మినహాయింపు వుంటుంది.
***** ఒక వేల సూచించిన కాలంలో సమాచారం అందించడంలో PIO విఫలమైతే పారా 8 లో తెల్పినట్టుగా సమాచారాన్నిఉచితముగా అందించాల్సి ఉంది.








సమాచారాన్ని అందించడానికి పట్టు ప్రతిస్పందన సమయం





48 గంటల
వ్యక్తి యొక్క జీవితం మరియు స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం కొరకు దరఖాస్తు స్వీకరించిన సమయం నుండి

30 రోజులు
అప్లికేషన్ యొక్క తేదీ నుండి

5 రోజులు
ప్రజలచే కోరిన సమాచారం మరొక పబ్లిక్ అథారిటీకి సంబంధం ఉంటే ఇటువంటి అభ్యర్థన అందిన 5 రోజుల కంటే ముందే ఆ పబ్లిక్ అథారిటీకి ఆ అభ్యర్థనను బదిలీ చేయాలి.

40 రోజులు
ఒకవేళ మూడవ పార్టీ ఆసక్తి చేరి ఉంటే.









తిరస్కరణకి గల కారణాలు



సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి, ఒక అభ్యర్థనకి వారు సమాచారం అందించడం వల్ల రాష్ట్రానికే కాకుండా వేరే ఎవరికైనా కాపీరైట్ హక్కును అతిక్రమణకు అవకాశం ఉన్న అభ్యర్థనను తిరస్కరించవచ్చు.










పాక్షికంగా బహిర్గతం చేయు సమాచారం



***** బహిర్గతం చేయడం నుంచి మినహాయింపు పొందని సమాచారం, మరియు సహేతుక మినహాయింపు సమాచారాన్ని కలిగిన ఏదైనా భాగం ఇవ్వదగినది అయితే, వాటిని పాక్షికంగా నియమాలకి అనుగుణంగా ఇవ్వబడుతుంది.








ఆంధ్రా బ్యాంక్ లో ప్రజా సమాచార అధికారుల నిర్మాణం










సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CAPIO)



కేంద్ర అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CAPIO)గా వున్న బ్రాంచ్ మేనేజర్లు/ అన్ని శాఖల బ్రాంచ్ హెడ్లు ప్రజల నుంచి సమాచారం కోసం అభ్యర్థనలు స్వీకరించి మరియు అవసరమైన చర్య కోసం cpioకి అందించడం జరుగుతుంది.








సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు (cpio)



ప్రిన్సిపాల్ అధికారులుగా వున్న అందరు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, జోనల్ కార్యాలయాల యందు రెండవ శ్రేణి అధికారులుగా వున్న కేంద్ర ప్రజా సమాచార అధికారులు (cpio)గా నియమించబడ్డారు. ప్రజల నుండి అభ్యర్థన అందిన వెంటనే CPIO దానిని పరిగణలోకి తీసుకొని మరియు సమాచారం తెలియజేయటం లేదా పేర్కొన్న సమయం లోపల అభ్యర్థనను తిరస్కరించడం చేస్తారు.








అప్పీలేట్ అధికారులు



కార్పొరేట్ ప్రధాన కార్యాలయం వద్దవున్న అందరు జనరల్ మేనేజర్లు సీనియర్ కేంద్ర ప్రజా సమాచార అధికారులు(SCPIO)గా చట్టం కింద కట్టుబడి అప్పీలేట్ అధికారులుగా వుంటారు, మరియు వారు కేంద్ర ప్రజా సమాచార అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా పౌరులు దాఖలుచేసిన మొదటి అప్పీల్ ను వినవచ్చును.








ఆంధ్రా బ్యాంక్ లో ప్రజా సమాచార అధికారిని గుర్తించడం ఎలా?



***** ప్రజలు వారి అభ్యర్థనను/ అప్లికేషన్ ను సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CAPIO) గా నియమించబడిన ఒక సమీప శాఖ బ్రాంచ్ మేనేజర్/ బ్రాంచ్ హెడ్ కు, సమాచారం కోసం దాఖలు చేయవచ్చు.
***** ప్రజలు ఒకవేల అభ్యర్థనను సమర్పించాలని ఉంటే వారి సమీప CAPIO ( సమీప శాఖను బ్రాంచ్ నెట్వర్క్ ద్వారా గుర్తించవచ్చు)కి సమర్పించవచ్చు. CAPIO ఒక విజ్ఞప్తి చేత, CPIO అభ్యర్థనకు సంబందించి నిర్దిష్ట పునర్విచారణ అధికార వివరముల కోసం ఏ నిర్దిష్టమైన అప్పేలెట్ అథారిటీకి అప్పీలును సమర్పించాలో క్రమంలో పరిశీలించి సంబంధించిన పద్దతిని సిద్ధపరుస్తారు.

















తరువాత





chiclogo