Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆన్ లైన్ ఎస్బి ఖాతా తెరచుట

సౌలభ్యం, సమయ పొదుపు మరియు మా విలువైన వినియోగదారుల భద్రతా ప్రయోజనాలతో, మా బ్యాంక్ సులువైన అంగల్లో ఎస్బి ఖాతాను ఆన్ లైన్ లో తెరవటానికి అవకాశం ఇచ్చింది.

ఆన్ లైన్ అప్లికేషన్ నింపడం కోసం కావలసిన ఆవశ్యకతలు:

  1. ఈ సౌకర్యం కేవలం నివసిస్తున్న భారతీయుల కోసం అందుబాటులో ఉంది.
  2. ఖాతా ఆపరేషన్ ను SELF మోడ్ లో మాత్రమే తెరవవచ్చు.
  3. పాస్ పోర్ట్ సైజు ఫోటోల సాఫ్ట్ కాపీ (పరిమాణం 10 KB కంటే తక్కువ ఉండాలి).
  4. కెవైసి పత్రాలు (KYC):

    1. ఫోటో ఐడి యొక్క స్కాన్ కాపీ
    2. అడ్రస్ ప్రూఫ్ స్కాన్ కాపీ (ఫోటో ఐడి కాకుండా వేరుది ఉండాలి)
      (ఆమోదయోగ్యమైన కెవైసి పత్రాలు ఆన్లైన్ అప్లికేషన్ లో డ్రాప్ డౌన్ మెను ద్వారా అందుబాటులో ఉన్నాయి)
    3. కెవైసి పత్రం ప్రతి పరిమాణం 500 KB కంటే తక్కువ ఉండాలి.
దరఖాస్తుచేసుకొను మరియు ట్రాకింగ్ ప్రక్రియ:

ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవడం కోసం ఆన్లైన్ దరఖాస్తు పూరించడానికి ప్రక్రియ క్లుప్తంగా ఈ కింది విధంగా ఉంటుంది:
  1. కస్టమర్ తన కొత్త ఖాతా తెరవడానికి ఏ శాఖనైనా ఎంచుకోవచ్చు మరియు నామినేషన్ వివరాలు కూడా అందించవచ్చు.
  2. ఫోటో, ఫోటో ఐడి మరియు ఆన్ లైన్ అప్లికేషన్ లో పేర్కొన్న చిరునామా రుజువు వంటి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
  3. అప్లికేషన్ యొక్క సమర్పణ తరువాత ఒక విశిష్ట ట్రాకింగ్ ఐడి సంఖ్య ఉత్పత్తి అవుతుంది మరియు అదే భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపరచుకోవాలి.
  4. అప్లికేషన్ యొక్క విజయవంతమైన సమర్పణతో ఒక ఇమెయిల్ విశిష్ట ట్రాకింగ్ ఐడి తో కస్టమర్ ఇచ్చిన ఇమెయిల్ ఐడికి పంపబడును. ఈ ట్రాకింగ్ ఐడిని ఉపయోగించి, వినియోగదారుడు అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు.
గమనిక :
  1. వినియోగదారుడు అప్లికేషన్ యొక్క సమర్పణ తేదీ నుండి, టి + 2 పని రోజుల తరువాత మరియు 15 రోజుల కంటే ముందు అసలు పత్రాలతో వ్యక్తిగతంగా ఎంపిక చేసుకున్న శాఖను సందర్శించి ఇవ్వాలి.
  2. కస్టమర్ వివరాల పరిశీలన తరువాత, శాఖ ఆ అప్లికేషన్ ను అనుమతించడానికి/ తిరస్కరించడానికి ఆస్కారం వుంది.
  3. వివరాలను విజయవంతంగా ధృవీకరణ/ ఆమోదం తరువాత, కొత్త ఖాతాను బ్రాంచ్ ఇస్తుంది.
  4. కస్టమర్ ఈ సౌకర్యం ద్వారా క్రింది ఎస్బి ఖాతాల రకాలు తెరచుకోవచ్చు.

    1. అభయ సేవింగ్ బ్యాంక్ (ASOGP)
    2. అభయ గోల్డ్ సేవింగ్స్ (AGOGP)
    3. ఎబి జీవన్ అభయ (AJOGP)
    4. ఎబి సూపర్ శాలరీ ఎస్బి ఖాతా (SBPRV)
ఖాతా సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పొదుపు ఖాతా ఆన్ లైన్ లో తెరిచేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మీ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయుటకు


chiclogo