Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

Depositstelugu

AB డైమండ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా

అర్హతలు
arrow

  • పేరుపొందిన కార్పొరేట్లు / కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తూ అధిక వేతనాలు పొందే వర్గాల వారు

  • ఆదాయ పన్ను మినహాయింపు గల సొసైటీలు/ ఛారిటబుల్ ట్రస్టులు మరియు విద్యా సంస్థలు

  • అధిక నికర విలువ (హై నెట్ వర్త్) గల వ్యక్తులకు.

  • ప్రారంభ డిపాజిట్ రూ. 50,000/ తో ఖాతాని తెరవవచ్చు.

  • త్రైమాసిక సగటు నిల్వ రూ. 3.00 లక్షలు వుండేట్లుగా ఖాతాని నిర్వహించాలి.

arrow ప్రయోజనాలు
arrow

  • లాకర్ కేటాయింపులో ప్రాధాన్యత.

  • పరిమితి లేని ఉచిత వ్యక్తిగత (పర్సనలైజ్డ్) చెక్ బుక్ సౌకర్యం

  • కెవైసి (KYC) నిబంధనలకి లోబడి, తతిమ్మా బ్రాంచిలలో స్వంత అవసరాల కోసం ఖాతా నుండి రూ. 1,00,000/ వరకు, ఛార్జీలు లేకుండా నగదు తీసుకునే సౌకర్యం.

  • కెవైసి .(KYC) నిబంధనలకి లోబడి, ఛార్జీలు లేకుండా స్వయంగా గానీ, ఇతరుల ద్వారా గానీ ఖాతాలో అపరిమితమైన మొత్తంలో నగదు జమ చేసుకునే సౌకర్యం.

  • ఎస్ ఎం ఎస్ (SMS) చార్జీల నుండి మినహాయింపు

  • ఎటిఎమ్ (ATM) / డెబిట్ కార్డుల వార్షిక మెయింటినెన్స్ చార్జీల నుండి మినహాయింపు ఎటిఎమ్ (ATM) / డెబిట్ కార్డులు వ్యక్తులకు మాత్రమే జారీ చేస్తారు.

  • 5 నుండి 75 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తిగత ఖాతాదారులకి రూ. 5.00 లక్షల ఉచిత ప్రమాద బీమా రక్షణ అందుబాటులో వుంటుంది. వ్యక్తి గతేతర ఖాతాదారులు ఈ బీమా రక్షణ అనర్హులు.

  • 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తిగత ఖాతాదారులకి రూ. 1.00 లక్ష ఉచిత జీవిత బీమా రక్షణ అందుబాటులో వుంటుంది. వ్యక్తి గతేతర ఖాతాదారులు ఈ బీమా రక్షణ అనర్హులు.

  • NEFT / RTGS చార్జీల (నెలకి అయిదు సార్లు, మునుపటి త్రైమాసికంలో వుండిన సగటు త్రైమాసిక నిల్వ మొత్తానికి మించకుండా) నుండి మినయాహీంపూ.

  • క్రెడిట్ కార్డు వార్షిక సబ్బ స్క్రిప్షన్ చార్జీల నుండి మినహాయింపు (నిబంధనలు T & C వర్తిస్తాయి)

  • డీ మాట్ (Demat) ఖాతా వార్షిక మెయింటినెన్స్ చార్జీల నుండి మినహాయింపు (నిబంధనలు T & C వర్తిస్తాయి)

  • ఉచిత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం.

  • స్టాప్ పేమెంట్ సూచనల కోసం చెల్లించ వలసిన చార్జీల నుండి మినహాయింపు

  • నెలకి ఒక సారి- ఉచిత అకౌంట్ స్టేట్ మెంటు, నిల్వకి సంబంధించిన సందేహాలకి ఇ-మెయిల్ ద్వారా ఉచిత సమాధానం.

  • ప్రాసెసింగ్ ఛార్జీలలో 15% రాయితీతో, రుణాలకి సంబంధించిన మార్గ దర్శకాలకి అనుగుణంగా ఈ ఖాతాదారులు రిటైల్ రుణాలకి అర్హులు.

  • పైన పేర్కొన్న ప్రయోజనాలు, ప్రారంభ జమ రూ. 50,000/ మరియు త్రైమాసిక సగటు నిల్వ రూ. 3.00 లక్షలు వున్నప్పుడు మాత్రమే లభిస్తాయి.

arrow త్రైమాసిక సగటు నిల్వ (QAB) నిర్దేశిత మొత్తానికి తగ్గినప్పుడు వసూలు చేసే ఛార్జీలు :
arrow

త్రైమాసిక సగటు నిల్వ
త్రైమాసికానికి పెనాల్టీ
రూ.3.00 లక్షలు
రూ.1,000 / -
 
 
 
chiclogo