Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి ఫ్రీడమ్ ( ఫ్లెక్సీ ) డిపాజిట్ పధకం

ఫ్రీడమ్ (ఫ్లెక్సీ) డిపాజిట్ పధకం

మా బ్యాంక్ 27.08.2008 నుండి ఎబి ఫ్రీడమ్ (ఫ్లెక్సీ) డిపాజిట్ పధకం ప్రారంభించిందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ పథకంలో గమనించదగిన ప్రధాన లక్షణాలు:

పథకం యొక్క స్వభావము

ఒక సేవింగ్స్ ఖాతా మరియు టర్మ్ డిపాజిట్ ఖాతా వినియోగదారుల సౌలభ్యం కోసం అనుసంధానము చేయబడినవి

అర్హత

వ్యక్తులు సంయుక్తంగా లేదా ఒంటరిగా, క్లబ్బులు, సంఘాలు, ట్రస్ట్, ఆస్పత్రులు, పాఠశాలలు మరియు కళాశాలలు మొదలగు సేవింగ్స్ ఖాతాలు తెరవడానికి అర్హులు అయినవారు . ప్రత్యేక మైనర్లకు ఈ పథకం కింద ఖాతాల తెరవడానికి అనుమతి లేదు.

ప్రత్యేక ఫీచర్లు ( ఉపయోగాలు )


1. ఆటో స్వీప్ & ఆటో-రివర్స్ స్వీప్ సౌకర్యం కలిగిన ఒక టెక్నాలజీ ఫ్రెండ్లీ ఉత్పత్తి

2. సేవింగ్స్ బ్యాంక్ (ఎబి ఫ్రీడమ్ ఎస్బి ఖాతా) లో కనీస బ్యాలెన్స్ రూ. 5,000 /- నిర్వహించవలేను.

3. ఆటో స్వీప్ సౌకర్యం క్రింద కనీస బ్యాలెన్స్ కన్నా అధికంగా ఉన్న మొత్తాన్ని రూ.1000/- యూనిట్లు యొక్క గుణిజాలుగా టర్మ్ డిపాజిట్ ఖాతాకు బదిలీ (కనీస యూనిట్లు సంఖ్య ఐదుగా నిశ్చయించబడినది. అనగా ,రూ.5,000 /-)

4. టర్మ్ డిపాజిట్ గా బదిలీ చేయబడిన యూనిట్లపై ఖాతాదారునికి డొమెస్టిక్ టెర్మ్ డిపాజిట్ రేట్ల వారీగా వడ్డీ ఇవ్వబడును.
సమయానుసార వడ్డీ చెల్లింపు త్రైమాసిక ప్రాతిపదికన అనుమతించబడును

5. ఎబి ఫ్రీడమ్ ఫ్లెక్సీ ఫిక్సిడ్ డిపాజిట్ యొక్క కాలవ్యవది 15 రోజులు నుండి 12 నెలలు

6. ఎబి ఫ్రీడమ్ ఫ్లెక్సీ రీ-ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ కాలవ్యవధి 6 నెలల నుండి 12 నెలల త్రైమాసిక గుణిజాలలో

7. కంప్లీట్ లిక్విడిటీ ( Complete Liquidity ) - డిపాజిట్ రూ.1000 యొక్క గుణిజాలుగా LIFO ( లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ) ఆధారంగా విభజన చేయబడును; మిగిలిన నిల్వలకై పూర్తి వడ్డీ పొందుతారు.

8. డిపాజిట్ యూనిట్ల రద్దు కోసం ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు..

9. ఆటో రివర్స్ సదుపాయం క్రింద .ఉన్న డిపాజిట్ యూనిట్ల అకాల ఉపసంహరణ కోసం ఎటువంటి జరిమానా లేదు.

10. టర్మ్ డిపాజిట్ యూనిట్లపై డిపాజిట్ రుణాలు అనుమతించబడవు.

11. డిపాజిట్ సర్టిఫికెట్ జారీ చేయబడదు

12. సేవింగ్స్ బ్యాంక్ మరియు టర్మ్ డిపాజిట్ లావాదేవీల ఖాతా ప్రకటన ( అకౌంట్ స్టేట్మెంట్ ) జారీ చేయబడుతుంది

13. ఎటిఎమ్ / డెబిట్ కార్డ్ అందుబాటులో ఉంది

14. నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది

15. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి


ఏ ఇతర స్పష్టీకరణకై, దయచేసి మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిని సంప్రదించండి.

chiclogo