Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

బ్యానర్

ప్రయాణ కార్డులు

ప్రయాణ కార్డులు:

వ్యాపార కేంద్రాల్లో విస్తృతంగా అంగీకరింపబడుతున్న దృష్ట్యా, అన్ని మాస్టర్ కార్డ్ అనుబంధ ఏ టీ యం ల లో నగదు పొందడం కోసం , విదేశీ కరెన్సీ మరియు ట్రావెలర్ చెక్కులకు ప్రత్యామ్నాయంగానూ , విదేశీ కరెన్సీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డ్ గుర్తింపు పొందింది.

వారి ప్రయాణ ఖర్చులకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు ఉపయోగించలేని లేదా ఉపయోగించడానికి ఇష్టపడని వినియోగదారులు , జారీ మరియు వాడుక లోని సౌలభ్యం దృష్ట్యా ,అత్యంత సురక్షితమైన ప్రీపెయిడ్ కార్డుల వాడుకకు ప్రాధాన్యమీయవచ్చు

వినియోగదారుని యొక్క అద్వితీయ పరిగణనలను దృష్టిలో ఉంచుకొని మా అంతర్జాతీయ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డ్ రూపొందించబడింది

ప్రారంభంలో, ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డులు, ఎంపిక చేయబడిన మా ఫారెక్స్ శాఖలలో US డాలర్ లలో జారీ చేస్తారు. చిప్ ఆధారిత యూరో మరియు GBP కార్డులు త్వరలో జారీ చేయబడతాయి.


మా ప్రయాణం కార్డుల లక్షణాలు

 1. 1. నగదు ఉపసంహరణ కోసం మరియు POS మాత్రమే ప్రయాణ కార్డుల వాడుక అనుమతింపబడుతుంది
 2. 2.రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ,ఇంటర్నెట్ మరియు ఐవిఆర్ (మొబైల్ / ఫోన్) చెల్లింపు లావాదేవీలు త్వరలో అనుమతింపబడతాయి.
 3. 3.ఆంధ్రా బ్యాంక్ ఏ టి యం లద్వారా చేసిన ,ఖాతాలో నగదు నిల్వ వివరాల విచారణకు ఎటువంటి ఛార్జ్ లు లేవు
 4. అంతర్జాతీయ కాల్స్ అందుకోగలిగిన సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా , అన్ని లావాదేవీలకు సంబంధించిన SMS అప్రమత్తతలు అందుకుంటారు.

ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డులు జారీ ప్రమాణాలు:

 • 18 సంవత్సరాలకు మించిన వయస్సు గల స్వదేశీ వ్యక్తులు
 • ఖాతాదారులు కాని వ్యక్తుల నుంచి కెవైసి పత్రాలు అర్ధింపబడతాయి.
 • సంబంధిత వ్యక్తిగత కెవైసి నిబంధనలు సంతృప్తికరంగా నిర్వహిస్తున్న సంస్థలకు; వారి ఉద్యోగులు, వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం, ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డులు జారీ చేయబడతాయి. అయితే, ఆ సంస్థ భారతదేశం లో ఏదైనా స్టాక్ ఎక్సేంజ్ లో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
 • ప్రారంభ లోడ్ 200 డాలర్లు గానూ మరియు గరిష్ట లోడ్ FEMA మార్గదర్శకాల మేరకు ఉంటుంది; అయితే,తిరిగి లోడ్ చేయదగిన కనీస విలువ 100 డాలర్లు
 • వ్యక్తులు / సంస్థలు FEMA మార్గదర్శకాల ప్రకారం అపరాధి అయి ఉండకూడదు
 • ఖాతాదారులు కాని వారి నుండి అన్ని రుసుములలోనూ 25% అదనపు ఛార్జీలు వసూలు చేయబడతాయి

ఇంటర్నేషనల్ ట్రావెల్ కార్డుల కొనుగోలు కోసం , సంబంధిత దరఖాస్తు మరియు అవసరమైన పత్రాలు మా నిర్దిష్ట శాఖలలో సమర్పించాల్సి ఉంటుంది

నిబంధనలు మరియు షరతులు:

 • ఒక వ్యక్తి, ఒక విదేశీ కరెన్సీ లో ఒకే కార్డు కలిగి ఉండాలి
 • వ్యక్తిగతకాని మరియు బదిలీచేయ వీలులేని కార్డులు జారీ చేయబడతాయి
 • కార్డ్ రెండు సంవత్సరాలు చెల్లే విధంగా , తిరిగి లోడ్ చేసుకునే సదుపాయం కలిగి ఉంటుంది
 • విదేశాలలోని ATM లలో స్థానిక కరెన్సీ లో మాత్రమే నగదు అనుమతించబడుతుంది
 • ఫీజు / ఛార్జీలు ఏ పరిస్థితులలో తిరిగి వాపసు ఇవ్వబడవు.
 • కార్డ్ ఖాతాలో ఉన్న నగదు నిల్వ పై వడ్డీ చెల్లింపబడదు.
 • ఏ పరిస్థితిలోనూ, ట్రావెల్ కార్డ్ ఖాతాలోని నిల్వకన్నా అధిక మొత్తం తీసుకొనేందుకు (ఓవర్డ్రాఫ్ట్) అనుమతించబడుతుంది
 • మాన్యువల్ కీ ఎంట్రి లావాదేవీలు, ఆఫ్ లైన్ మనీ ఆర్డర్ లేదా టెలిఫోనిక్ ఆర్డర్ లావాదేవీలు, ఇంటర్నెట్ జూదం వాడకం, వాయిదాల చెల్లింపులు, ప్రత్యక్ష డెబిట్ లావాదేవీలు, హోటల్స్ లో ప్రీ-ఆథరైజేషన్ బుకింగ్ లావాదేవీల కోసం ప్రయాణ కార్డులు అనుమతింపబడవు
 • నిబంధనల ప్రకారం అనుమతి లేని ఏ చెల్లింపులకీ కార్డు వినియోగించరాదు.
 • లా అండ్ పబ్లిక్ పాలసీ కి వ్యతిరేకంగా కార్డు వినియోగించరాదు.

కార్డ్ ఖాతా సమాచారాన్ని పొందడానికి వీలుగా మా వెబ్ సైట్ లో 'ప్రీపెయిడ్ కార్డు కస్టమర్ సెల్ఫ్ కేర్' కింద ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా నడిచే ఒక స్నేహపూర్వక ,స్వయంచాలిత వ్యవస్థ ఏర్పాటు చేయబడింది

బ్యాలెన్స్ ఎంక్వైరీ, లావాదేవీ వీక్షణ, కార్డ్ ఖాతా స్టేట్మెంట్ , కార్డు స్వీయ లాకింగ్ / అన్లాకింగ్, పిన్ మార్పు / అన్లాక్, కార్డు కోల్పోయినా /దొంగిలింపబడినా ఆ వివరాలు నమోదుకు, పోగొట్టుకున్న కార్డు భర్తీ కోసం అభ్యర్థన , ఫిర్యాదు నమోదు మొదలైన సేవలు అందుబాటులో ఉన్నాయి:

వివరణాత్మక నియమాలు మరియు నిబంధనలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛార్జీ ల వివరాలు:

ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డులు:


క్రమ సంఖ్య
సేవలు
ఛార్జీలు / ఫీజు
1
కార్డ్ జారీ
200 USD లేదా సమాన మొత్తం
2
ప్రాథమిక కార్డు పోగొట్టుకున్న కారణంగా సెకండరీ కార్డ్ వాడుక
200 USD లేదా సమాన మొత్తం
3
ప్రత్యామ్నాయ కార్డు మంజూరు
200 USD లేదా సమాన మొత్తం + వాస్తవిక తపాలా / కొరియర్ ఛార్జీలు
4
రీ లోడింగ్ ఛార్జీలు
లోడింగ్ విలువలో1% లేదా, `150 USD లేదా సమానమొత్తం , ఏది ఎక్కువైతే అది
5
రద్దు ఛార్జీలు
200 USD లేదా సమాన మొత్తం
5
కార్డు గడువుదాటిన 3 నెలల తరువాతకూడా నోటీసులకు కార్డు గ్రహీత నుంచి ఎటువంటి సమాధానం రాని పక్షంలో ,200 దాటిన నిలవ పై
నిల్వ మొత్తంలో 1% ప్రతి నెల పోగొట్టుకోవాలి

ఎటిఎమ్ ఛార్జీలు

క్రమ సంఖ్య
సేవలు
ఛార్జీలు / ఫీజు
1
నగదుపొందడం కోసం
2 డాలర్లు
2
బ్యాలెన్స్ విచారణ
అన్ని ఆంధ్రా బ్యాంక్ ఎటిఎంలలోనూ , మాస్టర్ కార్డ్ లోగోకలిగిన ఇతర ఎటిఎం ల లో
ఉచితం 0.50 డాలర్లు

ఇతర ఛార్జీలు

క్రమ సంఖ్య
సేవలు
ఛార్జీలు / ఫీజు
1
ఎటిఎంలు కాకుండా , విదేశాల్లో మాస్టర్ కార్డ్ అనుబంధం శాఖల ద్వారా నగదు పొందడానికి
1.75 డాలర్లు + తీసుకున్న మొత్తం పై 2 %
2
కార్డు తాత్కాలిక లాకింగ్
0.25 USD ఒక్క సందర్భానికి
3
కార్డులు హాట్ లిస్టింగ్ ఐన సందర్భంలో
2 డాలర్లు
4
పిన్ రీ- జారీ
1 డాలర్
5
చార్జ్ స్లిప్ శోధన
3 డాలర్లు
6
ఛార్జ్ బ్యాక్ రుసుము
2 డాలర్లు
7
స్టేట్మెంట్ ప్రింట్ & స్థానిక మెయిలింగ్ చిరునామాకి పంపేందుకు
1 డాలర్
8
కరెన్సీ మార్పిడి పై మార్కప్ రుసుము
3 %
@ సర్వీస్ టాక్స్ మరియు సర్ ఛార్జ్ అదనం


chiclogo