మా నినాదం "కస్టమర్ సేవ లో సమర్థత" మా సత్వర మరియు సమర్థవంతమైన సేవలు వినియోగదారులను ఆహ్లాదపరుస్తాయని మేము భావిస్తున్నాము. అయితే, వినియోగదారుల ఫిర్యాదులు బ్యాంకుల వ్యాపారభాగంగా ఉన్నాయి మరియు వినియోగదారులు వారి ఫిర్యాదులు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని భావిస్తున్నారు.
ఈ దిశలో, వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన " Upset - ఖాతాదార్ల ఫిర్యాదుల పరిష్కార సేవ" లను బ్యాంక్ ప్రారంభించింది. ఈ Upset సేవ ద్వారా వినియోగదారులు వారి సమస్యలను/ఫిర్యాదులను బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి నేరుగా SMS ద్వారా పంపవచ్చు . ఈ UPSET సేవ ముఖ్యాంశాలు ,పనితీరు ఈ కింద విధంగా ఉంటాయి
- వినియోగదారులు వారి మనోవేదన / ఫిర్యాదులు SMS ద్వారా మా ప్రధాన కార్యాలయానికి పంపేందుకు వీలుగా ప్రత్యేకంగా మొబైల్ నెంబర్ 9666606060 కేటాయించబడింది
- బాధిత కస్టమర్ వారి మొబైల్
లో UPSET అని టైప్ చేసి 9666606060 నెంబరుకు కు SMS ద్వారా పంపవలసి ఉంటుంది
- అలా అందుకున్న SMS లన్నిటినీ, ఒక సేవా ప్రదాత , బ్యాంక్ ఖాతాదారుల సేవా శాఖాదిపతికి పంపుతారు.
- వినియోగదారుని SMS అందిన వెంటనే , సేవా ప్రదాత వినియోగదారుని మొబైల్ కు తక్షణమే SMS అందినట్టుగా సమాచారం పంపుతారు
- ప్రతిగా, బ్యాంక్ ఖాతాదార్ల సేవా విభాగం , ఖాతాదారునికి ఫోన్ చేసి ఫిర్యాదు యొక్క పూర్తి వివరాలు సేకరించి, సదరు వివరాలను పరిష్కారం కోసం సంబంధిత శాఖ / కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా పంపుతారు
- సంబందిత శాఖ/కార్యాలయం, ఇమెయిల్ ద్వారా సమాచారం / ఫిర్యాదు అందుకున్న వెంటనే, విస్తృత నిబంధనలను అనుసరిస్తూ, సమస్య పరిష్కరించడానికి అవసరమైన చర్యలు నిర్ణయించి , అదే రోజున ఆ విషయాన్ని resolution@andhrabank.co.in కు ఈ మెయిల్ ద్వారా తెలియచేస్తారు
- బ్యాంక్ కేంద్ర కార్యాలయ ఖాతాదార్ల సేవా విభాగం, ఫిర్యాదు/మనోవేదన స్థితిని 48 గంటల్లోగా ఫిర్యాదుదారునికి తెలియచేస్తుంది
కొత్తగా పరిచయం చేసిన UPSET సేవ ద్వారా ఖాతాదార్ల ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం లభించడమే కాక , వారి అంచనాలను అందుకోవడానికి బ్యాంకువారికి అవకాశం కల్పిస్తుంది
కొత్త సేవ UPSET కు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ క్రింది చిరునామా కు పంపాలి :
చీఫ్ మేనేజర్ ,
"UPSET " పరిష్కార కేంద్రం ,
ఖాతాదారుల సేవా విభాగం
ఆంధ్రాబ్యాంక్ కేంద్ర కార్యాలయం,
సైఫాబాద్, హైదరాబాద్
టోల్ ఫ్రీ సంఖ్య 1800-425-1515 తో ఇప్పటికే టెలి బ్యాంకింగ్ సౌకర్యం కూడా మా వినియోగదారుల సేవకు అందుబాటులో ఉంది
(శ్రీ MN సుధాకర్)
జనరల్ మేనేజర్
|